
Ipl 2023 : ఒక్కసారి గ్యాప్ వచ్చిందంటే ఇక అంతే సంగతులు. మధ్యలో ఎందరెందరో వచ్చేస్తారు. కెరీర్ ముగిసినట్టే. రోజుకో యువ ఆటగాళ్లు అడుగుపెడుతున్న ఈ రోజుల్లో.. 2వేలు, 3వేలు, దాదాపు 4వేల రోజుల గ్యాప్ తరువాత ఐపీఎల్‌లో అడుగుపెట్టారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా సరే.. అన్ని వందల రోజుల తరువాత కూడా మేనేజ్‌మెంట్లు తీసుకున్నాయి. ఆడించాయి. 2023 ఐపీఎల్‌లో లాంగ్ గ్యాప్ తరువాత గ్రౌండ్‌లో అడుగుపెట్టిన ఆ ముగ్గురు ఎవరంటే…
1. హర్‌ప్రీత్ సింగ్ భాటియా… 3,981 రోజుల తరువాత
హర్‌ప్రీత్ సింగ్ భాటియా 2010లో ఫస్ట్ టైం ఐపీఎల్‌లో ఆడాడు. కోల్ కతా తరపున వచ్చిన భాటియా… ఆ తరువాత సీజన్లో పుణె వారియర్స్ జట్టుకు వెళ్లిపోయారు. ఇక 2019 మే 19వ తేదీన కోల్ కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్ ఆడాడు. ఆ తరువాత నుంచి మళ్లీ ఆడింది ఈ సీజన్‌లోనే. 3,981 రోజుల గ్యాప్ తరువాత పంజాబ్ కింగ్స్ జట్టు తరపున గ్రౌండ్‌లో అడుగుపెట్టాడు. ఏప్రిల్ 15న లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు.
2. వేయ్నే పార్నెల్… 3,242 రోజుల తరువాత
పార్నెల్ 2011లో పుణె వారియర్స్ తరపున ఫస్ట్ టైం ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. ఆ తరువాత ఢిల్లీ డేర్ డెవిల్స్ కు వెళ్లిపోయాడు. 2014 మే 23వ తేదీన ముంబైతో ఆడిందే లాస్ట్ మ్యాచ్. 3,242 రోజుల తరువాత ఈ సీజన్‌లో ఏప్రిల్ 10న ఆర్సీబీ తరపున ఆడాడు. వేలంలో ఎవరూ కొనకపోవడంతో రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా ఆర్సీబీ కొనుక్కుంది. మొన్నటి మ్యాచ్‌లో పార్నెల్‌తో ఆడించింది.
3. రిలీ రోసౌ… 2899 రోజుల తరువాత
సౌత్ ఆఫ్రికన్ స్టార్ రిలీ రోసౌ.. 2014లో ఆర్సీబీ తరపున ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. 2015లో కూడా ఆర్సీబీతోనే ఉన్నాడు. కాకపోతే.. మొత్తం 5 మ్యాచ్‌లు ఆడి కేవలం 53 పరుగులే చేశాడు. ఆ తరువాత నుంచి రిలీ రోసౌను ఎవరూ వేలంలో కొనుక్కోలేదు. అయితే, టీ20 ఇంటర్నేషనల్ మ్యాచుల్లో సౌత్ ఆఫ్రికా తరపున బాగా ఆడి.. మళ్లీ సెలక్టర్ల చూపుల్లో పడ్డాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ రిలీని కొనుక్కుంది. 2,899 రోజుల తరువాత మళ్లీ ఐపీఎల్ లో గ్రౌండ్లో అడుగుపెట్టాడు.