
Akhil Agent : ఈ మధ్య తెలుగు సినిమాలన్నీ పాన్ ఇండియా జపం చేస్తున్నాయి. చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు మార్కెట్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో కొందరు సక్సెస్ అవుతుంటే కొందరు దెబ్బతిన్నారు. దసరాతో ప్రయత్నించిన నాని భంగపడ్డాడు. శాకుంతలంతో సమంత పెద్ద బొప్పి కట్టించుకుంది. దీంతో ముందు లోకల్ మార్కెట్‌పై ఫోకస్ పెడుతున్నారు. అఖిల్ ఏజెంట్ కూడా ముందుగానే జాగ్రత్త పడ్డాడు.
సురేందర్ రెడ్డి-అఖిల్ కాంబినేషన్‌పై టాలీవుడ్‌లో మంచి బజ్ క్రియేట్ అయింది. ఈనెల 28న థియేటర్లలోకి వస్తున్న ఏజెంట్.. ఇప్పటికే భారీ ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. అటు సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తయ్యాయి. ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్. సినిమాను రెండున్నర గంటలకు లాక్ చేశారు.
టైటిల్‌లోనే ప్రై జానర్ మూవీ అని అర్థమైపోయింది. టైటిల్‌కు తగ్గట్టే భారీ ఎత్తున యాక్షన్ సీన్స్ ఉన్నాయంటున్నారు. సెన్సార్ రివ్యూ పేరుతో వినిస్తున్నదేంటంటే.. భారీ యాక్షన్ సీన్లను కలపడానికి మధ్యలో స్టోరీని పెట్టారని. అది కూడా అర్థవంతంగా. లవ్ ట్రాక్, రొమాన్స్, కామెడీ, ఎమోషన్.. ఓ భారీ హిట్‌కు కావాల్సినంత మాస్ మసాలా దట్టించారని చెబుతున్నారు. మొత్తంగా జేమ్స్ బాండ్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగించేలా మూవీ ఉండబోతోందని టాక్.
ఇక ఈ సినిమాలో మమ్ముట్టి లాంటి పెద్ద స్టార్ కూడా ఉన్నారు. సో, తెలుగుతో పాటు మలయాళం మార్కెట్‌ని టార్గెట్ చేస్తూ ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు. ఏజెంట్ సినిమాలో కేవలం అఖిల్ క్యారెక్టర్ మాత్రమే కాదు.. మూడు పాత్రలు మధ్య ఇంటెన్స్ డ్రామా అని చెబుతున్నరు. ఏజెంట్ కచ్చితంగా ఓ కొత్త అనుభూతిని ఇస్తుందని ఈ మధ్య హీరో అఖిల్ కూడా ప్రెస్ మీట్లో చెప్పాడు. పేరుకు ఏజెంట్ పాత్రే అయినా.. తన క్యారెక్టరైజేషన్ కోతి కోతిగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. సురేందర్ రెడ్డి గతంలో కిక్ సినిమా తీశాడు. ఇందులో కూడా రవితేజ క్యారెక్టర్ కోతి కోతిగా ఉంటుంది. కాని, ఆ సినిమానే బంపర్ హిట్ కొట్టింది. ఇప్పుడు.. ఏజెంట్ కూడా అదే తరహా ఉంటుందని, అంతే రేంజ్ హిట్ కొడుతుందని నమ్ముతున్నారు.