
Balakrishna Daughter:టాలీవుడ్‌లో నెపోటిజయ్ కొత్తేమీ కాదు. తెలుగు సినిమాలో సీనియర్ హీరోలుగా రాణించి వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు పాగా వేశారు. నట వారసులుగా ఆడియెన్స్‌ను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. కేవలం వారసులే వస్తున్నారనుకుంటే పొరపాటే.. మారతుఉన్న ట్రెండ్‌ను ఫాలో అవుతూ వారసురాళ్లు కూడా వచ్చేస్తున్నారు. మంచు ఫ్యామిలీ నుంచి లక్ష్మీ మంచు నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక మెగా ఫ్యామిలీ నుంచి చూస్తే చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత ఫ్యాషన్ డిజైనర్‌గా, నిర్మాతగా ఎంట్రీ ఇచ్చేశారు. ఇప్పుడు వీరి బాటలోకి మరో వారసురాలు అడుగు పెట్టనుంది. అదెవరో కాదు.. నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని.
తేజస్విని ప్రస్తుతం బాలకృష్ణ సినిమా, ఇతర ప్రోగ్రామ్స్‌కు సంబంధించిన వ్యవహారాలను దగ్గరుండి పరిశీలిస్తుంది. త్వరలోనే ఈమె సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టనుందనే టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న వార్తల మేరకు.. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో నెక్ట్స్ ఇయర్ ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం చాలా మంది నిర్మాతలు పోటీలు పడుతున్నారు. అయితే మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్ మేరకు 14 రీల్స్ ఈ సినిమాను నిర్మించనుంది. అయితే నందమూరి తేజస్విని ఇదే సినిమా నిర్మాణంలో 20 శాతం పెట్టుబడి పెట్టి.. లాభాల్లో వాటా తీసుకునేలా చర్చలు జరుగుతున్నాయట. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్‌లో సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు.