
Sukanya Samriddhi Yojana : ఆడపిల్లల కోసం కేంద్రం తీసుకొచ్చిన అద్భుత పథకం సుకన్య సమృద్ధి యోజన. ఈ పథకం కింద ఆడ పిల్ల తల్లితండ్రులు తమ పదేళ్ల లోపు వయస్సు గల కుమార్తెల పేరిట బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. తల్లితండ్రులు ఈ అకౌంట్లో 1,000 రూపాయల నుంచి లక్షన్నర రూపాయల వరకు జమ చేయవచ్చు. సుకన్య యోజన కింద జమ చేసిన డబ్బుకు బ్యాంకులు ఇతర పథకాల కన్నా ఎక్కువ వడ్డీని చెల్లిస్తాయి.
సుకన్య యోజన అకౌంట్ ప్రారంభించినప్పటి నుంచి 21 సంవత్సరాల నగదు వెనక్కి తీసుకునే వీలుండదు. ఒకవేళ 18 ఏళ్లు వయసొచ్చిన తర్వాత అమ్మాయి వివాహం కోసం కానీ, చదువుల కోసం కానీ జమ చేసిన మొత్తంలో 50 శాతం వరకు తీసుకునే వెసులుబాటు ఉంటుంది.
బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లలో చేసే డిపాజిట్లపై వడ్డీరేటును ప్రభుత్వం 8.1 శాతంగా నిర్ణయించింది. అంతే కాదు ఈ ఖాతాలో జమ చేసుకున్న సొమ్ముకు ఆదాయపన్ను మినాహాయింపు కూడా ఉంది. ఈ పథకం కింద 10 సంవత్సరాలలోపు వయసు గల బాలబాలికలు పేరు మీద పోస్టాఫీసులు, బ్యాంకుల్లో అకౌంట్ తెరిచి వారికి 14 సంవత్సరాలు నిండే వరకు సొమ్ము జమ చేయవచ్చు.
పోస్టాఫీసులో కానీ, అన్ని కమర్షియల్ బ్యాంకులకు చెందిన ఏ బ్రాంచ్ లోనైనా కానీ వెయ్యి రూపాయాల కనీస డిపాజిట్‌తో పుట్టినప్పటి నుంచి పదేళ్లలోపు ఎప్పుడైనా సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు తెరవవచ్చు. ఒక వార్షిక సంవత్సరంలో గరిష్టంగా లక్షన్నర వరకు జమ చేసుకునేందుకు వీలుంది.
అయితే ఈ సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఈ ఖాతా తక్కువ కాల పరిమితి పెట్టుబడిదారులకు హెల్ప్ అవదు. అకౌంట్లో జమ అయిన డబ్బు 21 సంవత్సరాల తర్వాత మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. ఈ పథకం కింద 10 సంవత్సరాలలోపు వయసు గల బాలబాలికలు పేరు మీద పోస్టాఫీసులు, బ్యాంకుల్లో అకౌంట్ తెరిచి.. వారికి 14 సంవత్సరాలు నిండే వరకు సొమ్ము జమ చేయవచ్చు.
ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం కింద ఇద్దరు బాలికలున్న తండ్రి.. రెండు ఖాతాల్లో విడివిడిగా సొమ్ముని జత చేయాల్సి ఉంటుంది. ముగ్గురు కూమార్తెలున్న తండ్రి మరో సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తెరిచేందుకు వీలు లేదు.
ఈ పథకం కింద జమ చేసిన నగదుని 21 సంవత్సరాల తర్వాతనే చెల్లిస్తారు. ఏదైనా కారణం చేత ముందుగా నగదుని విత్ డ్రా చేసుకుందామనుకుంటే ఇవ్వరు. ఒకవేళ బాలిక చనిపోతే దానిని వేరుగా పరిగణిస్తారు.