
Chiranjeevi – Shriya : మెగాస్టార్ చిరంజీవి, శ్రియా శరన్ మరోసారి వెండితెరపై మెరుపులు మెరిపించబోతున్నారా? అంటే అవుననే సమాధానం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. వీరిద్దరూ కలిసి 2003లో ఠాగూర్ సినిమాలో నటించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తర్వాత చిరంజీవి రాజకీయాల వైపు దృష్టి సారించటంతో ఆయన దాదాపు పదేళ్ల పాటు సినీ రంగానికి దూరమయ్యారు. తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ శ్రియా శరన్‌తో కలిసి నటించలేదు. అయితే ఇప్పుడు వీరిద్దరూ 20 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్‌ను షేక్ చేయబోతున్నారని టాక్.
వివరాల్లోకి వెళితే ప్రస్తుతం చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం భోళా శంకర్. ఈ సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్‌ను ప్లాన్ చేశాడు డైరెక్టర్ మెహర్ రమేష్. ఈ సాంగ్‌లో ఎవరినీ తీసుకుంటే బావుంటుందా? అని దర్శక నిర్మాతలు తెగ ఆలోచించారు. చివరకు శ్రియకు ఓటేశారని సమాచారం. ఇటు చిరు, అటు శ్రియ ఇద్దరూ మంచి డాన్సర్సే కావటంతో సాంగ్ పీక్స్‌లో ఉంటుందనటంలో సందేహం లేదు. తమిళ చిత్రం వేదాళంకు రీమేక్‌గా భోళా శంకర్ రూపొందుతోంది. తెలుగు నెటివిటీకి తగ్గట్లు కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఈ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నారు.
చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రం సిస్టర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతోంది. ఇందులో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. అక్కినేని ఫ్యామిలీకి దగ్గరైన హీరో సుశాంత్ ఇందులో కీలక పాత్రలో మెప్పించబోతున్నారు. సినిమా ఫైనల్ స్టేజ్ షూటింగ్‌ను జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి భోళా శంకర్‌ను ఆగస్ట్ 11న గ్రాండ్ రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ ఏడాది వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ కొట్టిన మెగాస్టార్ .. బోళా శంకర్‌తో ఎలాంటి హిట్ సొంతం చేసుకుంటారో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.