
Tiger Nageswara Rao : స్టువర్టుపురం. ఈ పేరు వింటేనే ఏదో తెలియని అలజడి. పేరు మోసిన దొంగల నేర సామ్రాజ్యానికి నెలవు అనే అభిప్రాయం ఏర్పడుతుంది. ఈ గ్రామం పేరు చెబితే దొంగల గురించి ఒకప్పుడు కథలు కథలుగా చెప్పేవారు. టైగర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అనేక రాష్ట్రాల్లో ఈ దొంగల ముఠా చెలరేగిన ఉదంతాలు గురించి కోకొల్లలుగా చెప్పేవారు. ఆ నేపథ్యంలోనే స్టువర్టుపురం మీద గతంలో చాలా సినిమాలే వచ్చాయి. తాజాగా రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వర్ సినిమాతో మరోసారి స్టువర్టువరం గ్రామం తెరపైకి వచ్చింది. ఇంతకు ఈ టైగర్ నాగేశ్వరరావు ఎవరు..? స్టువర్టుపురం దొంగల కథేంటి..? టైగర్ నాగేశ్వర్ రావు సినిమా ఎందుకు వివాదం అవుతోంది. సినిమాను నిలిపివేయాలని స్టువర్టుపురం గ్రామస్థులు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు.
స్టువర్టుపురం..ఏపీలోని బాపట్లకు 15 కిమీల దూరంలో ఉంటుంది. ఇప్పుడంటే అన్ని గ్రామాల్లాగే ఇదీ ఒకటి. ప్రజలు కూడా సాధారణ మనుషుల్లాగే మనలో ఒకరు. కానీ కాస్త చరిత్రలోకి వెళితే స్టువర్టుపురం అంటే.. చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలకు, ఇంకా చెప్పాలంటే.. పక్క రాష్ట్రాలకు కూడా హడల్. బ్రిటీష్ పాలకుల కాలం నుంచే స్టువర్టుపురం దొంగలకు నెలవనే పేరు వచ్చింది. ఆనాడు సమాజంలో ఉన్న వివక్ష, అణచివేత, ఆర్థిక పరిస్థితులతో సువర్టుపురంలో కొంతమంది దొంగతనాన్ని ప్రారంభించారు. అలా ఊరికి ముద్ర పడింది.
1913లో అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ హోం సభ్యుడు హెరాల్డ్ స్టువర్ట్.. ఉపాధిలేక దొంగలుగా మారిన వారికి పారిశ్రామిక, వ్యవసాయ పనులను కల్పించాలని సాల్వేషన్ ఆర్మీని కోరాడు. అంతేగాక వారికి ప్రత్యేకంగా పునరావాసం కల్పించాలని తెలిపాడు. ఉపాధి, ఆవాసం కల్పించడం వల్ల వారు నేరాలకు దూరంగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఆయన డిమాండ్ మేరకు బిట్రీష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలనీయే ఈ స్టువర్టుపురం. ఎక్కువమంది నేరాలు చేసినవారిని అక్కడికి తరలించడం వల్ల పోలీసులు అక్కడి ప్రజలపై నిత్యం నిఘా ఉంచేవారు. ఎక్కడ దొంగతనం జరిగినా పోలీసులు అక్కడికి వచ్చి ఆరా తీసేవారు. కాలం గడిచే కొద్ది ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోయినా.. ఆ మచ్చ మాత్రం అలాగే ఉండిపోయింది.
Nawaz Sharif about India : భారత్ సూపర్ సక్సెస్.. పాక్ అడుక్కుంటోంది.. నవాజ్ షరీఫ్ సంచలన కామెంట్స్..