
Modi praises Autism boy: కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన ప్రతిభావంతుడు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత కామిశెట్టి వెంకట్ పై ప్రధాని మోదీపై ప్రశంసలు కురించారు. శనివారం వరంగల్ పర్యటనకు వచ్చిన మోదీ సభా వేదిక ప్రాంగణంలో వెంకట్ ను కలిశారు. అతని ప్రతిభను మెచ్చుకున్నారు.

విభిన్న ప్రతిభాంతులను ప్రోత్సహిస్తే వారూ అందరిలానే అద్భుతాలు సాధిస్తారని మోదీ చెప్పారు. ప్రధానిని కలవడంపై వెంకట్ తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
వెంకట్ ప్రతిభ యువశక్తికి ఒక పవర్‌హౌస్ అని మోదీ ట్వీట్ చేశారు. వరంగల్ సభ తర్వాత ట్వీట్ చేసిన మోదీ.. ఆటిజం అతని ప్రతిభను అడ్డుకోలేకపోయిందని పేర్కొన్నారు. నాటు నాటు పాట పాడటంతోపాటు డ్యాన్స్ కూడా చేశాడని తెలిపారు. కామిశెట్టి వెంకట్ మనోధైర్యానికి సెల్యూట్ అంటూ అభినందించారు మోదీ.