
International Men’s Day : ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మాదిరి పురుషులకూ ఓ ప్రత్యేక రోజు ఉంది. పురుషుల గొప్పతనాన్ని కొనియాడేందుకు ప్రతి ఏటా నవంబర్ 19న అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని భారత్‌తో సహా 75కు పైగా దేశాల్లో ‘ఇంటర్నేషనల్ మెన్స్‌డే’ను సెలబ్రేట్ చేసుకుంటారు. అసలు ఈ మెన్స్ డే ఎప్పుడు మొదలైందో తెలుసుకుందాం రండి.
1990కి ముందే మెన్స్‌డే సెలబ్రేషన్స్ మొదలైనప్పటికీ.. ఐకరాజ్య సమితి ఆమోదంతో మొదటి ఇంటర్నేషనల్ మెన్స్‌డే 1999 నవంబర్ 19న కరేబియన్ దేశాల్లోని ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ప్రారంభమైంది. ఇక ఇండియాలో 2007లో మొదటి మెన్స్‌డే సెలబ్రేషన్స్ జరిగాయి. అలా దాదాపు 75 పైగా దేశాల్లో ప్రతి ఏటా ఒక థీమ్‌తో మెన్స్‌డే సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉంటాయి. 2024 థీమ్.. ఏంటంటే.. ‘పురుషులు ఎదుర్కొంటున్న సమస్యలను హైలెట్ చేసి వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయడం’.
సెలబ్రేషన్స్ ముఖ్య ఉద్దేశ్యం.. ప్రతి ఇంట్లో కుటుంబ భారాన్ని మోసే పురుషుడు ఉంటాడు. సమాజంలో స్త్రీ, పురుషులు సమానమే అయినప్పటికీ.. ఓ స్త్రీ కష్టానికి దక్కిన ప్రశంసలు పురుషుడికి దక్కవు. అందుకే ప్రతి కుటుంబ భారాన్ని మోసే పురుషుడిని ప్రశంసించడంతో పాటు వారి శారీరక, మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించడమే ఈ ఇంటర్నేషనల్ మెన్స్‌డే ముఖ్య ఉద్దేశ్యం. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీ ఇంట్లో కుటుంబ భారాన్ని మోసే పురుషుడికి ఇంటర్నేషనల్ మెన్స్ డే విషెస్ చెప్పేయండి.