
MS Dhoni Birthday Celebrations : MS ధోని… ఈపేరు వింటే క్రికెట్ ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తాయి. ఎంతమంది స్టార్ ప్లేయర్స్ ఉన్నా.. ధోని క్రేజే వేరు. రైల్వే టీసీతో జీవితాన్ని ఆరంభించి… క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించుకున్నాడు. 42 ఏళ్లు వచ్చిన ఇంకా ఫ్యాన్స్ లో క్రేజ్ తగ్గలేదు. ఇవాళ ధోని పుట్టిన రోజు సందర్భంగా.. తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు వేడుకలు చేస్తున్నారు.
మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో 52 అడుగుల కటౌట్ ఏర్పాటు చేయగా.. ఇక ఏపీలోని నందిగామలో 77 అడుగుల పొడవు ఉన్న ధోని కటౌట్ ఏర్పాటు చేశారు అని చెప్పాలి. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ధోనీకి ఉన్న క్రేజ్ ఇది అంటూ ఎంతమంది కామెంట్లు చేస్తున్నారు మహి ఫ్యాన్స్.
అటు ఏపీలోని విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. నందిగామ మండలం అంబారుపేట గ్రామం వద్ద ఏర్పాటు చేసిన ధోనీ 77 అడుగుల భారీ కటౌట్ ప్రయాణికులు, వాహనదారులను ఆకట్టుకుంటోంది. గతేడాది కూడా ధోనీ పుట్టిన రోజు సందర్భంగా అదే ప్రాంతంలో సుమారు 44 అడుగల ఎత్తులో ధోనీ కటౌట్ ఏర్పాటు చేశాను. ఈ సారి 100 అడుగుల ఎత్తులతో కటౌట్ ఏర్పాటు చేయాలని ముందుగా నిర్ణయించినప్పటికీ .. వాహనదారుల భద్రతను దష్టిలో ఉంచుకుని 77 అడుగులకే పరిమితమయ్యినట్లు చెప్పారు అభిమానులు.