MSK Prasad : ఇది ముమ్మాటికి పిచ్ సమస్యే: ఎమ్మెస్కే

MSK Prasad : ఇది ముమ్మాటికి పిచ్ సమస్యే: ఎమ్మెస్కే

MSK Prasad
Share this post with your friends

MSK Prasad

MSK Prasad : వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ ఆసాంతం మ్యాచ్ విశ్లేషణలు చేస్తూ  అప్పటికప్పుడు కామెంటేటర్లు అడిగే ప్రశ్నలకు తనదైన శైలిలో మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే సమాధానాలిచ్చారు. అద్భుతంగా గెలుపు, ఓటములను విశ్లేషించారు. అయితే అహ్మదాబాద్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ కి సంబంధించి మాత్రం ఇండియన్స్  ఎందుకిలా ఓటమి పాలయ్యారన్న కామెంటేటర్ల ప్రశ్నకు ఎమ్మెస్కే ఇచ్చిన సమాధానం అందరినీ ఆలోచనలో పడేసింది.

ఇది ముమ్మాటికి పిచ్ సమస్యేనని తెలిపారు. ఫైనల్ మ్యాచ్ కి ఇలాంటి పిచ్ ని రెడీ చేయడం దారుణమని అన్నారు. ఎప్పుడైనా సరే, మొదట ఆడిన వారు కానివ్వండి, రెండోసారి ఆడినవారు కానివ్వండి.. పిచ్ బౌలింగ్ కి టర్న్ అవాలి తప్ప, ఇది కంప్లీట్ రివర్స్ లో రైజ్ అయింది, ఆటగాళ్ల ముఖాల మీదకి బాల్ వచ్చిందని అన్నారు. దానికితోడు ఆస్ట్రేలియన్లు అన్నీ ఆఫ్ పిచ్ , బౌన్స్ లు వేశారు. దీంతో మనవాళ్లు సింగిల్స్ తీయడానికే కష్టపడాల్సి వచ్చిందన్నారు.

దీంతో వికెట్లను కాపాడుకోవడమే గగనం అన్నట్టు ఆడారని అన్నాడు. అదే ఆస్ట్రేలియా దగ్గరికి వచ్చేసరికి ఆడుతా పాడుతూ రన్స్ చేసుకుంటూ వెళ్లిపోయారని అన్నాడు. అసలు రోహిత్ శర్మ అవుటైన తర్వాత మళ్లీ ఫోర్ రావడానికి ఎంత సమయం పట్టిందో చూశారు కదా అన్నాడు. ఇది ముమ్మాటికి పిచ్ లోపమేనని తేల్చి చెప్పాడు.

ప్రతిష్టాత్మకమైన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కి ఒక పనికిరాని పిచ్ ని చేశారని అన్నారు.  ఆ బాల్స్ చాలా ప్రమాదకరంగా వచ్చాయని అన్నారు. అలాంటి పిచ్ పై టీమ్ ఇండియా 240 పరుగులు చేయడం సామాన్యమైన విషయం కాదని అన్నారు. తీరా చూస్తే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా పిచ్ అలాగే ఉందా? అంటే చూస్తుండగానే బ్యాటింగ్ కి అనుకూలంగా మారిపోయిందని వివిరించారు.

నిజానికి అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో మొత్తం 11 పిచ్‌లు ఉన్నాయి. ఇందులో ఐదు పిచ్‌లు నల్లమట్టితో కూడినవి. వీటిపై మంచి బౌన్స్ లభిస్తుంది. ఎర్రమట్టితో  మిగిలిన ఆరు పిచ్‌లు ఉన్నాయి. ఇవి త్వరగా మందకొడిగా మారతాయి.

అందుకే ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచుకి నల్లమట్టి పిచ్‌ ని ఎంపిక చేశారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఈ మైదానంలో నాలుగు మ్యాచులు జరిగాయి. అందులో ఛేజింగ్ చేసిన జట్లే మూడు సార్లు గెలిచాయి. మొత్తంగా ఈ పిచ్ బ్యాటర్లు, బౌలర్లు ఇద్దరికీ సమానంగా సహకరించాయని క్యూరేటర్లు తెలిపారు.

 ఛేజింగ్‌లో బ్యాటింగ్ చేసే జట్టుకు పరిస్థితులు కష్టంగా మారుతాయని మొదటి నుంచి చెబుతూ వచ్చారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా ఇబ్బంది పడింది. ఛేజింగ్ చేసిన ఆస్ట్రేలియా విజయం సాధించింది.

అంటే పిచ్ రిపోర్ట్ అందించడంలో కూడా క్యూరేటర్లు విఫలమయ్యారని అంటున్నారు. ఒకవేళ నిజంగా రోహిత్ టాస్ గెలిచి ఉంటే, వీళ్ల మాటలు నమ్మి బ్యాటింగ్ తీసుకునేవాడే అంటున్నారు.

కానీ ఆస్ట్రేలియా కెప్టెన్ ఫీల్డింగ్ అనేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్లు పిచ్ ని కనిపెట్టారు. మనవాళ్లు విఫలమయ్యారు. బ్యాటింగ్ పిచ్ అనుకోవడం వల్ల ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకుండా వచ్చారు. ఎప్పటిలా ఆడుతూ పాడుతూ కొట్టేద్దామని, కానీ ఇది మొత్తం రివర్స్ అవడంతో ఏం జరిగిందో అర్థమయ్యేసరికి మూడు వికెట్లు పడిపోయాయి. దాంతో కంప్లీట్ డిఫెన్స్ లోకి వెళ్లిపోయారు.  కానీ ఆస్ట్రేలియన్లు కరెక్టుగా పిచ్ గురించి అంచనాతో వచ్చారు. విజయం సాధించారు.

నిజానికి ఈ ఓటమి టీమ్ ఇండియాది కాదు. పిచ్ ని నాసిరకంగా తయారు చేసి, మనవాళ్లే ఇండియా ఓటమికి కారణమయ్యారని పిచ్ క్యూరేటర్లపైన, అహ్మదాబాద్ స్టేడియం నిర్వాహకులపై మండిపడుతున్నారు. ప్రధాని మోదీని కూడా తిట్టిపోస్తున్నారు.

పనికిరాని చోట, పనిలేని చోట ఇలాంటి పెద్ద పెద్ద స్టేడియంలు కడితే, చూసేవాడు, చేసేవాడు లేక ఇలాగే తగలడతాయని అంటున్నారు. ముందు అహ్మదాబాద్ మీద దిక్కుమాలిన ప్రేమ తగ్గించమని అంటున్నారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Best Online personal loan : పెరుగుతున్న పర్సనల్ లోన్స్ .. బ్యాంకుల పోటాపోటీ ఆఫర్.. ఆన్‌లైన్ లోన్స్ ఎంత వరకు సేఫ్

Bigtv Digital

Facebook Love:ఫేస్‌బుక్‌ ప్రేమకథ.. ప్రియుడి కోసం పాకిస్థాన్ లోకి ఎంట్రీ..

Bigtv Digital

Lucky Name: పేరు తీసుకొచ్చే అదృష్టం అందరికి ఒకేలా ఉండదా..?

BigTv Desk

Revanth Reddy: కాంగ్రెస్ లో ‘తీన్మార్ మల్లన్న’ చిచ్చు.. సీనియర్లపై సీపీ ఆనంద్ ఎఫెక్ట్..

BigTv Desk

Tambulam : తాంబూలంలో తమలపాకు తింటున్నారా?

BigTv Desk

Mahaboobabad Crimes : మద్యం మత్తులో విద్యార్ధినిపై ఉపాధ్యాయుడి దాడి.. పరిస్థితి విషమం

BigTv Desk

Leave a Comment