
Rahane in Test World Cup : లండన్‌లో జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌లో రహానేకు కూడా చోటు దక్కింది. 15 మందితో వరల్డ్ కప్ జట్టును ప్రకటించింది బీసీసీఐ. జూన్‌లో ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు రహానేను కూడా తీసుకున్నారు. దీనికి కారణం ఇంగ్లండ్ గడ్డపై రహానే ఆట తీరే.
టెస్ట్ కెరీర్‌లో 82 మ్యాచ్‌లు ఆడిన రహానే.. 12 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలతో 4,931 పరుగులు చేశాడు. అటు ఇంగ్లండ్ గడ్డపై కూడా మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఇంగ్లండ్‌లో 29 టెస్టులు ఆడిన రహానే.. ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు చేసి 729 పరుగులు చేశాడు
1. 2014, లార్డ్స్‌లో…
2014లో ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లిన టీమిండియాకు 82 ఏళ్ల తరువాత టెస్ట్ విజయ దక్కింది. ఆ మ్యాచ్‌లో ఇండియాను గెలిపించింది అజింక్యా రహానానే. ఆ మ్యాచ్‌లో 74 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి.. ఓటమి అంచున ఉన్న ఇండియాను తన సెంచరీతో గెలిపించాడు. 154 బంతులకు 103 పరుగులు చేసి ఐకానిక్ విక్టరీ కట్టబెట్టాడు.
2. 2018, నాటింగ్‌హామ్‌లో…
2018 టూర్‌లో అప్పటికే రెండు టెస్ట్ మ్యాచులలో ఓడిపోయంది టీమిండియా. ఆ సిరీస్ లో ఒక్క కొహ్లీ తప్ప మిగతా వారెవరూ రాణించలేదు. కాని, మూడో టెస్టులో కొహ్లీకి తోడుగా రహానే వచ్చాడు. ఫస్ట్ డే.. ఈ ఇద్దరూ కలిసి ఇంగ్లండ్ బౌలర్లకు చెమటలు పట్టించారు. 12 బౌండరీలు బాదిన రహానే..81 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్ లో ఇండియా గెలిచింది.
3. 2021, లార్డ్స్ లో…
ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కొహ్లీ వరుసగా ఔట్ అయి.. కష్టాల్లో పడ్డ టీమిండియాను చటేశ్వర్ పూజారాతో కలిసి టీమిండియాను నిలబెట్టాడు రహానే. ఆ మ్యాచ్ లో 146 బంతుల్లో 61 పరుగులు చేశాడు. రహానే కారణంగానే సెకండ్ ఇన్నింగ్స్ లో 325 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.
4. 2014, సౌతాంప్టన్ లో…
ఇంగ్లండ్ తో జరిగిన థర్డ్ టెస్టులో రహానే వరుస ఇన్నింగ్సులలో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 54 పరుగులు చేయడంతో ఇండియా 330 పరుగులు చేసింది. ఫోర్త్ ఇన్నింగ్స్ లో మిగతా ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే ఔట్ అవుతున్న వేళ.. రహానే ఒక్కడే 52 పరుగులు చేశాడు.
5. 2021, సౌతాంప్టన్ లో…
వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ అది. న్యూజిలాండ్ తో జరిగిన ఆ మ్యాచ్‌లో రహానే చేసిన 49 పరుగులు చాలా కీలకం. ఆ గేమ్ లో రహానే హాఫ్ సెంచరీ మిస్ అయినప్పటికీ.. ఆ మాత్రం పరువు నిలుపుకోగలిగిందంటే.. రహానే వల్లే.