
RCB Green : ఆర్సీబీకి గ్రీన్ కలర్ జెర్సీ పెద్దగా కలిసిరాదు. ఈసారి కూడా అదే జరుగుతుందనుకున్నారు అభిమానులు. కాని, రంగు పడింది. బెంగళూరు జట్టు గెలిచింది. ఇప్పటి వరకు గ్రీన్ జెర్సీ వేసుకుని ఆడిన ఆటల్లో నాలుగు సార్లు గెలిచింది.
సీజన్‌కు ఓసారి గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగుతుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఈ గ్రీన్ డ్రస్ వెనక పెద్ద చరిత్రే ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్ ఆడినప్పుడు స్టేడియంలో మొత్తం 19,488 వాటర్ బాటిళ్లతో సహా 9047.6 కిలోల చెత్త పోగయింది. సుమారు 8 టన్నుల పొడి వ్యర్థాలు, ఆహార వ్యర్థాలు, ఇతర పదార్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా ఈ జెర్సీలను తయారు చేశారు.
నిజానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2011 నుంచి ప్రతి సీజన్‌లో గ్రీన్ జెర్సీలో ఒక మ్యాచ్ ఆడుతుంది. ‘గో గ్రీన్’ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు ఆటగాళ్లు ధరించిన జెర్సీని… స్టేడియంలో సేకరించిన వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా తయారు చేశారు. విరాట్ కోహ్లీ టాస్ వేస్తున్న సమయంలో ప్రత్యర్థి జట్టు కెప్టెన్ సంజూ శాంసన్‌కు మొక్కను అందించడంతో పాటు పర్యావరణంపై అందరికీ అవగాహన కల్పించాలని సందేశం ఇచ్చాడు.
అయితే, బెంగళూరు జట్టుకు గ్రీన్ జెర్సీలో దారుణమైన రికార్డులు ఉన్నాయి. 2011 నుంచి ఇప్పటివరకు ఆకుపచ్చ జెర్సీని ధరించి మొత్తం 12 మ్యాచ్‌లు ఆడింది. అందులో లేటెస్ట్ మ్యాచ్‌తో కలిపి కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే గెలవగలిగింది. ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోగా.. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు.