
Siraj :- హైదరాబాదీ ఆటగాడు మహ్మద్ సిరాజ్ దుమ్మురేపుతున్నాడు. ప్రత్యర్థి బ్యాట్స్ మెన్‌కు చుక్కలు చూపిస్తూ.. బెంగళూరు జట్టుకు బ్యాక్ బోన్‌గా నిలుస్తున్నాడు. ఓవైపు వికెట్లు అకౌంట్లో వేసుకుంటూనే.. మరోవైపు రికార్డులను సైతం తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఈ ఐపీఎల్ ఈ సీజన్ లో ఎక్కువ డాట్ బాల్స్ వేసిన బౌలర్ గా నంబర్ 1 స్థానంలో నిలిచాడు మహ్మద్ సిరాజ్. ఈ సీజన్ లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ 24 ఓవర్లు బౌలింగ్ వేసి.. అందులో అత్యధికంగా 81 డాట్ బాల్స్ ఇచ్చాడు.
ముఖ్యంగా పవర్ ప్లేలోనూ చాలా పొదుపైన బౌలింగ్ వేస్తున్నాడు సిరాజ్. పవర్ ప్లేలో 72 బంతులేసిన సిరాజ్.. 51 బంతులకు పరుగులే ఇవ్వలేదు. ఇది సరికొత్త రికార్డ్. పైగా 7 ఎకానమీతో 12 వికెట్లు తీసుకున్నాడు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌కు పేస్‌ను జోడిస్తూ అద్భుతాలు చేస్తున్నాడు. ప్రస్తుతం పర్పుల్ క్యాప్ ఓనర్ మహ్మద్ సిరాజే. పంజాబ్‌తో జరిగిన లాస్ట్ మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డ్ కూడా దక్కింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు.
ఇక డాట్ బాల్స్ వేయడంలో సిరాజ్ తర్వాత షమీ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. షమీ మొత్తం 65 డాట్ బాల్స్ వేశాడు. జోసెఫ్ 48, మార్క్ ఉడ్ 48, అర్షదీప్ 45, భువనేశ్వర్ 45, రషీద్ ఖాన్ 45 డాట్ బాల్స్ వేశారు.