
West Bengal Politics(Latest political news in India) : రాజకీయాల్లోకి టీమిండియా మాజీ క్రికెటర్ గంగూలీ ఎంట్రో ఇవ్వబోతున్నారా? ఎందుకంటే సోషల్ మీడియాలో ఓ ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ ట్వీట్‌లో ఏముంది? యూ ఆస్కడ్ అండ్ ఇట్స్ హియర్ అని రాసుకొచ్చాడు గంగూలీ. దీంతో పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖరారు అయిందని ప్రచారం జరుగుతోంది. రేపు బర్త్ డే సందర్భంగా కీలక ప్రకటన చేస్తానని వెల్లడించాడు గంగూలీ.
మమత బెనర్జీ వర్సెస్ గంగూలీగా బెంగాల్ రాజకీయం మారబోతుందా? గత ఎన్నికల్లో కూడా పార్టీలో చేర్చుకోవాలని ట్రై చేసింది కమలం పార్టీ. ఇప్పుడు బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పుకోవడంతో.. దాదా చూపు రాజకీయాల వైపు మళ్లింది. బెంగాల్‌లో మమతకు చెక్ పెట్టాలంటే… గంగూలీనే సరైన వ్యక్తి అనే యోచనలో ఉన్నారు కమలనాథులు.
ఇప్పటికే చాలాసార్లు గంగూలీ పొలిటికల్ ఎంట్రీపై ఎన్నో ఊహాగానాలు వచ్చాయ్. కానీ ప్రతిసారి ఈ ప్రచారాన్ని కొట్టిపారేశాడు. ఇప్పుడు ఏకంగా ఈయన యూ ఆస్కడ్ అండ్ ఇట్స్ హియర్ అని ట్వీట్ చేయడంతో రేపు ఏం ప్రకటిస్తాడన్నది చర్చనీయాంశంగా మారింది.