Twitter :- కోహ్లీ, ధోనీ, రోహిత్‌కు ట్విటర్ షాక్... బ్లూటిక్ మాయం -

Twitter :- కోహ్లీ, ధోనీ, రోహిత్‌కు ట్విటర్ షాక్… బ్లూటిక్ మాయం

Twitter :- కోహ్లీ, ధోనీ, రోహిత్‌కు ట్విటర్ షాక్... బ్లూటిక్ మాయం
Share this post with your friends

Twitter :- ఎలన్ మస్క్ ఎంతటి వారైనా వదలడం లేదు. సబ్‌స్క్రిప్షన్ తీసుకోకపోతే.. నిర్మొహమాటంగా బ్లూటిక్ తీసేస్తున్నాడు. ఆ బ్లూటిక్ ఉంటేనే ఆథరైజ్డ్ అకౌంట్ అని అర్థం. లేదంటే.. ఒక్కో సెలబ్రిటీ పేరు మీద లక్షల అకౌంట్లు పుట్టుకొస్తాయి. ఇలా సబ్‌స్క్రిప్షన్ తీసుకోనందుకు క్రికెట్ దిగ్గజాలు.. ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ట్విటర్ అకౌంట్ బ్లూటిక్ తీసేశారు. వీళ్లే కాదు.. ఇండియాలో టాప్ సినీ హీరోలు, హీరోయిన్లు, పొలిటికల్ లీడర్స్, వీఐపీలు.. ఇలా సబ్‌స్క్రిప్షన్ తీసుకోని వాళ్లందరి బ్లూటిక్స్ పీకేసింది ట్విటర్.

ఇప్పటి వరకు కొహ్లీ, రోహిత్, ధోని ట్విటర్ అకౌంట్లకు లెగసీ బ్లూటిక్ ఉంది. దీని కారణంగానే వీళ్ల అకౌంట్లకు ఫాలోవర్స్ పెరుగుతున్నారు. వీళ్లు ఒక్క ట్వీట్ చేస్తే అంత క్రేజ్ వస్తోంది. మస్క్ రానంత వరకు వెరిఫికేషన్ టిక్ ఫ్రీగా ఇచ్చారు. ఇప్పుడు మస్క్ వచ్చాడు, సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొచ్చాడు. వెరిఫైడ్ బ్లూటిక్ కోసం యూజర్లు డబ్బులు చెల్లించాల్సిందేనని, చెల్లించని వారి ప్రొఫైల్స్ నుంచి బ్లూటిక్ మార్క్‌ను తీసేస్తామని ఓ డెడ్ లైన్ పెట్టారు. మస్క్ స్టేట్ మెంట్‌ను తేలిగ్గా తీసుకున్నారు కాబోలు.. అందరి ట్విటర్ అకౌంట్ల నుంచి బ్లూటిక్ ఎగిరిపోయింది.

ట్విటర్ బ్లూ సబ్‌స్క్రైబర్లు 4 వేల క్యారెక్టర్ల వరకు టెక్ట్స్ పంపించుకోవచ్చు. అదే, ఇతరులు అయితే 280 క్యారెక్టర్లకు మించి పంపలేరు. అంతేకాదు, బ్లూ సబ్‌స్క్రైబర్లు 60 నిమిషాల నిడివి ఉన్న వీడియో లేదంటే 2జీబీ వరకు ఉన్న వీడియోను కూడా పంపుకోవచ్చు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Webb Telescope: 700 మిలియన్ ఏళ్లనాటి గ్యాలక్సీలను కనుగొన్న టెలిస్కోప్..

Bigtv Digital

REVANTHREDDY : దేశాన్ని కాపాడేందుకే రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్ర: రేవంత్ రెడ్డి

BigTv Desk

Banda Prakash : మండలి డిప్యూటీ ఛైర్మన్ గా బండ ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నిక.. కేసీఆర్ అభినందనలు

Bigtv Digital

Mahesh Babu 28 : మ‌హేష్ డ్యూయెల్ రోల్‌..!

Bigtv Digital

TS: తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త

Bigtv Digital

Encounter: ఐదుగురు టెర్రరిస్టులు హతం.. కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్..

Bigtv Digital

Leave a Comment