David warner :హైదరాబాద్‌లో తిరుగులేని వార్నర్.. టాప్-5 మ్యాచ్‌లుటైటిల్

David warner :హైదరాబాద్‌లో తిరుగులేని వార్నర్.. టాప్-5 మ్యాచ్‌లు

David warner
Share this post with your friends

David warner : నాలుగేళ్ల తరువాత డేవిడ్ వార్నర్ హైదరాబాద్ గ్రౌండ్‌లో అడుగుపెట్టాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా మంచి సక్సెస్ సాధించింది హైదరాబాద్‌తోనే, హైదరాబాద్ గ్రౌండ్‌లోనే. ఈసారి మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. సోమవారం మ్యాచ్‌లో ఫెయిల్ అయినప్పటికీ.. డేవిడ్ వార్నర్ హైదరాబాద్‌లో ఆడిన టాప్ మ్యాచ్‌లను గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు.

1. 59 బంతులు 90 పరుగులు నాటౌట్
ఏప్రిల్ 18, 2016. హైదరాబాద్ వర్సెస్ ముంబై మ్యాచ్‌‌లో డేవిడ్ వార్నర్ విశ్వరూపం చూపించాడు. ఆ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను 145 పరుగులకే కట్టడి చేసింది హైదరాబాద్. అయితే, 146 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి హైదరాబాద్ బ్యాట్స్ మెన్ ఆపసోపాలు పడ్డారు. వరుసగా పెవిలియన్ చేరారు. ఆ సమయంలో వార్నర్ ఒక్కడే నిలబడి.. 59 బంతుల్లో 90 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

2. 50 బాల్స్.. 92 రన్స్
ఏప్రిల్ 30, 2016. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లోనూ బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించాడు వార్నర్. ఆ మ్యాచ్‌‌లో బెంగళూరు జట్టు 5 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ తొందరగా ఔట్ అవడంతో జట్టు బాధ్యతను తీసుకున్నాడు వార్నర్. విలియమ్సన్, హెన్రిక్ సపోర్ట్‌తో 50 బాల్స్‌లో 92 పరుగులు చేసి విజయాన్ని అందించాడు.

3. 55 బంతులు.. 100 పరుగులు నాటౌట్
మార్చి 31, 2019. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌ అన్నిటికంటే హైలెట్. ఆ మ్యాచ్‌లో వార్నర్‌తో పాటు జానీ బెయిర్‌స్టో కూడా సెంచరీలు చేశారు. బెయిర్‌స్టో 56 బాల్స్‌లో 114 పరుగులు చేస్తే.. డేవిడ్ వార్నర్ 55 బంతుల్లో.. 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో హైదరాబాద్ 232 పరుగులు చేస్తే.. బెంగళూరు 113 పరుగులే చేసింది.

4. 54 బంతులు.. 109 పరుగులు నాటౌట్
డేవిడ్ వార్నర్ ఐపీఎల్ ఫస్ట్ సెంచరీ చేసింది కూడా హైదరాబాద్‌లోనే, హైదరాబాద్ పైనే. 2012 సీజన్‌లో డేవిడ్ వార్నర్ ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులో ఉన్నాడు. ఆ సీజన్‌లో మే 10వ తేదీన జరిగిన మ్యాచ్‌లో డెక్కన్ ఛార్జర్స్‌పై రెచ్చిపోయాడు. డెక్కన్ ఛార్జర్స్ ఇచ్చిన 188 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలో దిగింది ఢిల్లీ. ఆ మ్యాచ్‌లో 54 బంతుల్లో 109 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి ఢిల్లీని గెలిపించాడు వార్నర్.

5. 58 బంతులు.. 126 పరుగులు
ఏప్రిల్ 30, 2017. కోల్ కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విశ్వరూపం చూపించాడు డేవిడ్ వార్నర్. సునీల్ నరైన్, కుల్దీప్ లాంటి బౌలర్లను సైతం ముప్పతిప్పలు పెట్టాడు. ఆ మ్యాచ్‌లో 58 బంతుల్లో.. 126 పరుగులు చేశాడు. ఇప్పటికీ వార్నర్‌కు ఇదే బెస్ట్ రికార్డ్. ఆ మ్యాచ్‌లో కోల్ కతా 48 పరుగుల తేడాతో ఓడిపోయింది.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Telangana: మంత్రిపై ‘నో ఎఫ్‌ఐఆర్’.. కోర్టు సీరియస్..

Bigtv Digital

Gold : బంగారానికి మంచి రోజులు

BigTv Desk

Parasuram: త‌మిళ హీరోతో ప‌ర‌శురాం మూవీ!

Bigtv Digital

China : చైనాలో కరోనా విలయం.. రోజూ 9 వేల మంది మరణం..

Bigtv Digital

Pakistan Cricket Board : పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ప్రకంపనలు?.. ఇంజమామ్ సంచలన నిర్ణయం..

Bigtv Digital

Kane Williamson : ఆ ముగ్గురే మా కొంప ముంచారు.. కీలక వ్యాఖ్యలు చేసిన కివీస్ సారథి

Bigtv Digital

Leave a Comment