Varun Tej-Lavanya : మెగా వారి పెళ్లి పత్రిక.. సోషల్ మీడియాలో వైరల్ ..

Varun Tej-Lavanya : మెగా వారి పెళ్లి పత్రిక.. సోషల్ మీడియాలో వైరల్ ..

Varun Tej-Lavanya
Share this post with your friends

Varun Tej-Lavanya : మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగబోతున్న విషయం అందరికీ తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తమ సీక్రెట్ లవ్ ను పెళ్లి పీటల వరకు తీసుకువచ్చేసారు. ఇరు కుటుంబాల ఆశీర్వాదంతో సింపుల్గా ఎంగేజ్మెంట్ కార్యక్రమం చేసుకున్న ఈ జంట త్వరలో వివాహ బంధంలో అడుగుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో మెగా కాంపౌండ్ లో పెళ్లి సందడి మొదలైంది. వరుస పార్టీలతో మెగా కుటుంబం కాబోయే జంటకు రోజుకు ఒక ట్రీట్ ఇస్తున్నారు.

మామూలుగా మెగా ఫ్యామిలీలో ఫంక్షన్ ఏదైనా జరుగుతుంది అంటే అది ఎంత మెగా ఈవెంట్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. చిరంజీవి తర్వాత మెగా కుటుంబం నుంచి వరుసగా హీరోలుగా వచ్చి మెగా సభ్యులు బాగానే సెటిల్ అయిపోయారు. అలా మెగా కుటుంబం నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరుణ్ తేజ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా టాలీవుడ్ లో ఉన్న వరుణ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు.

లావణ్య త్రిపాఠి తో వరుణ్ పెళ్లి నవంబర్ 1వ తారీఖున పెద్దల సమక్షంలో ఇటలీ వేదికగా జరుగుతుంది. ,మెగా వారి పెళ్లి అంటే ఎప్పుడు గ్రాండ్ గానే ఉంటుంది.. ఇంతకుముందు ఇలాగే నిహారిక పెళ్లి కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ గా చేశారు. బోలెడు ఖర్చు పెట్టి చేసిన ఆ పెళ్లి ఎక్కువ కాలం నిలవలేదు అనుకోండి.. మెగా డాటర్ల పెళ్లి విషయంలో అపశృతులు పలుకుతున్నా.. మెగా సన్స్ మాత్రం పెళ్లి చేసుకొని బాగానే సెటిల్ అవుతున్నారు.

ఇక లావణ్య కూడా తన పెళ్లి పదిలంగా ఉండాలి అనే ఉద్దేశంతో కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టడానికి డిసైడ్ అయినట్లు టాక్. ఇక ఆ విషయం పక్కన పెడితే జూన్ 9న ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నారు. నవంబర్ 1 వ తారీఖున ఈ జంట పెళ్లి చాలా కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఇటలీలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు పెళ్లికి సంబంధించిన పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మంచి సిల్వర్ కలర్ లో ఉన్న పెళ్లి కార్డు పై మొదట పెళ్ళికొడుకు వరుణ్ తేజ్ తాతా నానమ్మ పేర్లు పెట్టారు. ఆ తర్వాత పెదనాన్న చిరంజీవి ,బాబాయి పవన్ కళ్యాణ్ ,ఇక అన్నయ్య రామ్ చరణ్ పేర్లను ముద్రించారు. దీనితోపాటుగా వరుణ్ తేజ్ తల్లిదండ్రులు నాగబాబు ,పద్మ లావణ్య దంపతుల పేర్లను కూడా పత్రికలో ముద్రించారు.

వధువు తరఫున లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులు కిరణ్, దియోరాజ్ త్రిపాటి పేర్లు ముద్రించడం జరిగింది. పెళ్లికి ఇంకా ఐదు రోజులు కూడా వ్యవధి లేదు కాబట్టి వరుణ్ లావణ్య అప్పుడే ఇటలీకి బయలుదేరి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని కూడా వరుణ్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించడం జరిగింది. పెళ్లి ఇటలీలో జరిగినా.. ఇక్కడ వారిని సంతృప్తి పరచడానికి ఇవ్వబోయే రిసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్ గా ఉంటుందని టాక్. మెగా కుటుంబం అంటే కేవలం సినీ ఫీల్డ్ కే పరిమితం కాదు కదా.. అటు వ్యాపారం ఇటు రాజకీయం కూడా ముడిపడి ఉన్న కుటుంబం కాబట్టి చాలా గ్రాండ్ గా పార్టీని అరేంజ్ చేస్తారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు కూడా హాజరుకానున్నారు. 


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Ram Charan: నెపోటిజంపై స్పందించిన మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్

Bigtv Digital

Suriya: 70 కోట్లతో లగ్జరీ ఫ్లాట్.. ముంబైకి హీరో సూర్య షిఫ్ట్?

Bigtv Digital

Cyclone : దూసుకొస్తున్న మాండూస్ తుపాన్.. తీరం ఎప్పుడు దాటుతుందంటే?

BigTv Desk

Hawaii: ఊరంతా కాలి బూడిద.. ఆ ఇల్లు మాత్రం సేఫ్.. ఎందుకంటే?

Bigtv Digital

Levis:- ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్‌తో ఏఐ ఒప్పందం..

Bigtv Digital

Parvati Devi : పార్వతీదేవిని దుర్గ అని ఎందుకంటారు?

BigTv Desk

Leave a Comment