
World Cup final : టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు టీమిండియా స్క్వాడ్‌ను ప్రకటించింది బీసీసీఐ. అనూహ్యంగా అజింక్యా రహానే ఈ జట్టులో ఉండడం నిజంగా సర్‌ప్రైజింగ్. బార్డర్-గవాస్కర్ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ గాయపడడంతో.. అనుకోకుండా అజింక్యాకు అవకాశం వచ్చింది. పైగా ఈ సీజన్ ఐపీఎల్‌లో ఫస్ట్ టైం బ్యాట్‌కు పనిచెప్పాడు. అంటే… ఫామ్ లోకి వచ్చినట్టే. ఇక ఆ ఫామ్ కొనసాగించడమే మిగిలి ఉంది. పైగా ఇంగ్లండ్‌లో రహానేకు మంచి ట్రాక్ రికార్డే ఉంది.
రోహిత్ సేనలోకి రహానేతో పాటు కొంత మంది ప్లేయర్లు కూడా సర్‌ప్రైజింగ్ ఎంట్రీ ఇచ్చారు. జూన్ 7వ తేదీన ఓవల్ గ్రౌండ్‌లో జరగనున్న టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు కేఎస్ భరత్, జయదేవ్ ఉనద్కత్ ను కూడా సెలెక్ట్ చేయడం నిజంగా ఆశ్చర్యమే.
15 మంది టెస్టు స్క్వాడ్‌లో రోహిత్ శర్మ, శుభమన్ గిల్, చటేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, రవిచంద్ర అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ ఉన్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ ఏడు నుంచి 11 వరకు జరగనున్నది. 12వ తేదీన రిజర్వ్ డేగా ఉంచారు.