Big Stories

Health Benefits Of Nuts: నెల రోజుల పాటు నట్స్ తింటే జరిగేదిదే..

Health Benefits Of Eating Nuts: ఆరోగ్యంగా ఉండాలంటే ఏవేవో కసరత్తులు చేయాల్సిన అవసరం లేదు. ఆహార మార్పులు, జీవనశైలి మార్చుకుంటే సరిపోతుంది. అందులో భాగంగానే నట్స్ తినమని నిపుణులు సలహా ఇస్తున్నారు. నట్స్‌లో జీడిపప్పు, పిస్తా, వాల్‌నట్స్, బాదం, సన్‌ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, చియా సీడ్స్ ఇలా ఎన్నో రకాలున్నాయి. ఇందులో అన్ని నట్స్‌కి ఒక్కో ప్రత్యేకత ఉంది. అయితే వీటిని ఎప్పుడో ఒకసారి కాకుండా నెల రోజుల పాటు గుప్పెడు తింటే శరీరంలో చాలా మార్పులు వస్తాయని నిపుణులు అంటున్నారు.

- Advertisement -

ముఖ్యంగా పరగడుపున నట్స్ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. అంతేకాకుండా నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి ఇవి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. నట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

గుండెకు రక్షణ:
నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు మోనోశాచురేటెడ్ పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి రక్తపోటును తగ్గించడంతో పాటు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీని వల్ల గుండెజబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 2019లో న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం నెల రోజుల పాటు ప్రతిరోజూ 50 గ్రాముల నట్స్ తినే వ్యక్తుల కంటే నట్స్ తినని వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని కనుగొన్నారు.
క్యాన్సర్ నుంచి రక్షణ:
నట్స్ లో సెలీనియం, విటమిన్, ఇ, ఫినోలిక్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి.నట్స్ తినడం వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరానికి ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడతాయి. అంతే కాకుండా చర్మ కణాలను కూడా కాపాడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఇన్‌ఫెక్షన్ రాకుండా నివారిస్తాయి. క్యాన్సర్, అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి.
బరువు తగ్గేందుకు:
బరువు తగ్గాలనుకునే వారు ప్రతి రోజూ గుప్పెడు నట్స్ ఆహారంలో భాగంగా చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటిలో క్యాలరీలు ఉంటాయి కాబట్టి గుప్పెడు తిన్నా పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. ఆకలిని కూడా ఇవి నియంత్రిస్తాయి. కాబట్టి శరీర బరువు తగ్గుతుంది. నట్స్ వల్ల పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.
షుగర్ ఉన్నవారికి:
డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజు నట్స్ ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. గ్లైసెమిక్ ఇండెక్స్ నట్స్ లొ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే వీటితో పాటు ఫైబర్, ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకోవడంలో ముందుంటాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు.
బ్రెయిన్ హెల్త్:
మెదడు ఆరోగ్యానికి కూడా బాదం,వాల్‌నట్స్ వంటివి ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని ఓమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ ఇ, విటమిన్ బి6, మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా వయసు సంబంధిత మెదడు వ్యాధుల ప్రమాదం నుంచి తగ్గిస్తాయి.
ఎముకల ఆరోగ్యానికి:
నట్స్ లో ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటివి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఆర్థరైటిస్ వంటి వ్యాధుల బారిన పడకుండా ఇవి రక్షిస్తాయి. అలాగే నట్స్ లో ఉండే అమైనో ఆమ్లం, సెరోటోనిన్ ఉత్పత్తిని ఇవి పెంచుతాయి. అంతే కాకుండా మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News