Gangrene side effects: ఈ రోజుల్లో డయాబెటిస్‌ను కూడా సాధారణ రోగంగా పరిగణిస్తున్నారు. దాన్ని చాలా లైట్ తీసుకుంటున్నారు. దాని వల్ల ఏదో ఒక రోజు ప్రమాదమే. అది ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే.. తప్పకుండా యూకేకు చెందిన ఓ రోగికి ఎదురైన చేదు అనుభవం గురించి తెలుసుకోవల్సిందే. ముఖ్యంగా అబ్బాయిలు.. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలి. లేకపోతే.. భవిష్యత్తులో ‘అది’ ఉండదు.
ఏం జరిగింది? డయాబెటిస్ వల్ల కలిగే ముప్పు ఏమిటీ?
ఇటీవల ఓ 65 ఏళ్ల వ్యక్తి పీకలదాకా తాగి ఆస్పత్రి పాలయ్యాడు. పురుషాంగం వద్ద తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న అతడికి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. CT స్కాన్ పరిశీలించిన వైద్యులు.. అతడి పరిస్థితి చూసి షాకయ్యారు. అతడి అంగం ముందుంటే స్కిన్ (శిశ్నాగ్ర చర్మము) పూర్తిగా కుళ్లిపోయింది. అక్కడ చాలా గడ్డలు కనిపించాయి. అవి పొత్తికడుపు వరకు విస్తరించి ఉన్నాయి. దీంతో వైద్యులు వెంటనే అతడికి చికిత్స అందించారు. అప్పటికప్పుడు యాంటీబయాటిక్స్ ఇచ్చి.. ఇంటికి పంపేశారు.
తీవ్రమైన జ్వరంతో మళ్లీ హాస్పిటల్‌కు..
కట్ చేస్తే.. వారం రోజుల తర్వాత అదే వ్యక్తి తీవ్రమైన జ్వరంతో హాస్పిటల్‌లో చేరాడు. అతడి మర్మాంగాల నుంచి చాలా దుర్వాసన వస్తోందని, మూత్రం కూడా కంపు కొడుతోందని డాక్టర్లకు చెప్పాడు. యాంటీబయాటిక్స్ ఇచ్చినా సరే.. ఎందుకు నయం కాకపోవడంతో డాక్టర్లు.. అతడికి మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. కుళ్లిన ప్రాంతం వద్ద చర్మం పూర్తిగా పొడిబారిపోయింది. అక్కడ రక్తపు చుక్క కూడా లేదు. దీంతో వెంటనే అతడికి రక్త మార్పిడి చికిత్స నిర్వహించారు. మరోసారి అతడికి యాంటీబయాటిక్స్ డోస్ ఇచ్చారు. ఇన్సులిన్స్ కూడా అందించారు.
అయితే, అప్పటికి కూడా అతడి పరిస్థితి కుదుట పడలేదు. దీంతో వైద్యులు తప్పని పరిస్థితుల్లో కీలక నిర్ణయం తీసుకోవల్సి వచ్చింది. ఆ విషయాన్ని చెప్పగానే బాధితుడు షాకయ్యాడు. కానీ, అది చేయకపోతే తన ప్రాణాలకే ప్రమాదమని తెలుసుకుని.. తప్పని పరిస్థితుల్లో డాక్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో వైద్యులు.. అతడి పురుషాగంలో ‘గ్యాంగ్రీన్’ (కుళ్లిన భాగం) గురైన చర్మం మొత్తాన్ని తొలగించారు. పూర్తి అంగాన్ని తొలగించారు.
ఎందుకిలా జరిగింది?
ఈ సర్జరీకి ముందు డాక్టర్లు.. అతడి అంగాన్ని కట్ చేయకూడదని భావించారు. కానీ, అక్కడి కణజాలం కుళ్లిపోయి నల్లగా మారడం(నెక్రోసిస్)తో కత్తిరించక తప్పలేదు. దీనిపై యూరాలజీ నిపుణులు స్పందిస్తూ.. ‘‘అంగానికి సమృద్ధిగా రక్తం సరఫరా కాకపోవడం వల్ల.. అక్కడ ‘ఇస్కీమిక్ గ్యాంగ్రీన్’ అభివృద్ధి చెందింది. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఇది సెప్సిస్‌కు దారి తీస్తుంది. రోగి ప్రాణాలు కూడా తీయొచ్చు’’ అని తెలిపారు.
‘‘కుళ్లిన చర్మానికి తిరిగి జీవం పోసే అవకాశాలేవీ కనిపించలేదు. అందుకు అవసరమైన కణజాలం అక్కడ లేదు. అందుకే, పూర్తిగా అతడి అంగాన్ని తొలగించాల్సి వచ్చింది’’ అని వైద్యులు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని రోగికి వివరించామని, అందుకే అతడు చికిత్సకు అంగీకరించాడని తెలిపారు. మీకు కూడా ఇలాంటి లక్షణాలేవైనా కనిపిస్తే.. వెంటనే యూరాలజిస్టులను సంప్రదించాలని సూచించారు.
Also Read: ముఖంపై మొటిమలా.. ? ఈ ఫేస్ ప్యాక్‌తో చెక్ !
గ్యాంగ్రీన్ అంటే?
రక్త సరఫరా కోల్పోవడం వల్ల శరీర కణజాలం చనిపోయే ఒక తీవ్రమైన పరిస్థితినే గ్యాంగ్రీన్ అంటారు. అది శరీరంలో ఎక్కడైనా చోటుచేసుకోవచ్చు. కాళ్లు, వేళ్లు.. చేతులు.. ఇలా ఏ ప్రాంతంలోనైనా గ్యాంగ్రీన్ ఏర్పడవచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ రోగులకు ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ. రక్త సరఫరా నిలిచిపోగానే.. ఆ భాగాల్లో డ్రై గ్యాంగ్రీన్ ఏర్పడుతుంది. ఆ తర్వాత అక్కడి కణజాలం చనిపోతుంది. అక్కడ వాపు ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆ ప్రాంతం ఎర్రగా.. చివరిగా పచ్చగా.. నల్లగా మారుతూ కుళ్లిపోతుంది.
1883లో మొదటిసారి ‘ఫోర్నియర్స్’ అనే గ్యాంగ్రీన్‌ను గుర్తించారు. ఇది మాంసాన్ని తినే వ్యాధి. బ్యాక్టీరియా సంక్రమణ వలన ఏర్పడుతుంది. మొదట్లో అది పురుషుల వృషణాలపై ప్రభావం చూపుతుందని భావించారు. కానీ, అది పూర్తిగా జననేంద్రియాలు, పెరినియం, పాయువుల కణజాలాలకు కూడా వేగంగా వ్యాపిస్తోందని తెలుసుకున్నారు. అది పొత్తి కడుపు వరకు చేరుకుంటే.. జీవితం మీద ఆశలు వదలేసుకోవల్సిందే. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న పురుషులకు తక్షణ వైద్య, శస్త్రచికిత్స అవసరం.
వీటి వల్లే ఎక్కువ ఎఫెక్ట్
అతిగా మద్యం తాగే వ్యక్తులకు ఇలాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇంకా డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి కూడా ఈ ముప్పు ఎక్కువే. ఇది కాళ్లు, పాదాలు, వేళ్లు, చేతులు, జననాంగాలతో సహా ఎక్కడైనా ఏర్పడవచ్చు. ఎరుపు, ఊదా లేదా నలుపు చర్మం, వాపు, తీవ్రమైన నొప్పి, పుండ్లు లేదా పొక్కులు వంటివి ఏర్పడుతున్నట్లయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. కేవలం మద్యపానం వల్ల మాత్రమే.. స్మోకింగ్ వల్ల కూడా ఈ సమస్యలు రావచ్చు. మీకు ఆ అలవాట్లు ఉంటే వెంటనే మానుకోవడం ఉత్తమం. లేకపోతే మగతనం బూడిదైపోతుంది.