Food Poisoning: ప్రస్తుతం గడుపుతున్న జీవనశైలితో ఆరోగ్యం చాలా రకాలుగా ఇబ్బందుల బారిన పడుతుంది. ముఖ్యంగా బయట తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే ఇంట్లో తినే టైం లేక టిఫిన్ దగ్గర నుంచి లంచ్, డిన్నర్, స్నాక్స్ అంటూ బయటే పూట గడిపేస్తున్నారు. అయితే ఈ తరుణంలో కొంత మంది ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని భావిస్తూ ఫ్రూట్ జ్యూస్ తాగుతుంటారు. ఈ తరుణంలో బయట దొరికే ఫ్రూట్ జ్యూస్ లలో ఎక్కువగా షుగర్, ఐస్ వేసి చేస్తుంటారు. దీంతో తాగడానికి రుచికరంగా ఉంటాయి. అందువల్ల తరచూ ఒక గ్లాసు జ్యూస్ అయినా తాగుతుంటారు.
మార్కెట్లో తయారుచేసే జ్యూస్ ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. రోడ్డు పక్కన తయారు చేసే జ్యూస్ లు తాగడం వల్ల తీవ్రమైన వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కలరా:
మార్కెట్లో విక్రయించే జ్యూస్ ల కారణంగా కలరా వంటి వైరస్ బారిన పడుతుతున్నారు. ఇది నీటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అందువల్ల మార్కెట్లో పరిశుభ్రత లేకుండా తయారుచేసే జ్యూస్ లను తాగడం వల్ల ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఫుడ్‌పాయిజన్:
ముఖ్యంగా మార్కెట్లోని జ్యూస్ లు తాగుతూ చాలా మంది ఫుడ్ పాయిజన్ వంటి సమస్యలకు గురవుతున్నారు. ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా కూడా జ్యూస్ సెంటర్లు దర్శనమిస్తున్నాయి. అయితే ఇలా ఉండే జ్యూస్ సెంటర్లు పరిశుభ్రత పాటించకుండా తయారు చేసే జ్యూస్ లు తాగడం వల్ల ఫుడ్ పాయిజన్ బారిన పడాల్సి వస్తుంది. ఈ తరుణంలో తలనొప్పి, వాంతులు , కడుపునొప్పి, కళ్లు తిరగడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పాడైపోయిన పండ్లను ఉపయోగించి జ్యూస్ లు తయారుచేయడం వల్ల ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
టైఫాయిడ్:
రోడ్లపై పెట్టుకుని జ్యూస్ లు తయారుచేయడం వల్ల పండ్లపై దుమ్ము, ధూళి, ఈగలు, దోమలు వాలుతుంటాయి. అందువల్ల బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి వస్తుంటాయి. అంతేకాదు జ్యూస్ లలో వాడే నీరు మురికిగా ఉండడం వ్లల టైఫాయిడ్ వంటి జ్వరం సోకుతుంది.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)