Figs Side Effects: ప్రస్తుతం భూమి అంతా కాలుష్యానికి గురవుతుంది. ఈ తరుణంలో భూమిపై జీవించే ప్రతీ జీవరాశి అనారోగ్యానికి గురవుతుంది. అంతేకాదు తరచూ ఏదో ఒక ముప్పు పొంచి ఉండడంతో చాలా ప్రాణాలు బలైపోతున్నాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి వ్యాపించి ప్రపంచంలో అల్లకల్లోలం సృష్టించి పోయింది. దీంతో ప్రస్తుతం ప్రజలు తమ ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఈ తరుణంలో తరచూ ఆకుకూరలు, కూరగాయలు, డ్రైఫ్రూట్స్ వంటివి ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ డ్రైఫ్రూట్స్ లోని ముఖ్యమైన అంజీరను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
అంజీర పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో ఔషధ గుణాలు కూడా అధికంగా ఉంటాయి. అంజీరలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, కాపర్ వంటి పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇవి ఆరోగ్యానికి అన్ని విధాలుగా మేలు చేస్తాయి. ముఖ్యంగా సంతానోత్పత్తి కోసం అంజీర అద్భుతంగా పనిచేస్తుంది. సంతానం కోసం చూసే పురుషుల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేలా చేస్తుంది. అంతేకాదు అంజీర పండ్లను తినడం వల్ల శరీరానికి చాలా రకాలుగా ప్రయోజనాలు ఉంటాయి. అయితే అంజీరను తింటే ప్రయోజనాలతో పాటు అతిగా తింటే ప్రమాదాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
అంజీరను తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో సల్ఫేట్ పెరుగుుతంది. అంతేకాదు మైగ్రేన్, తలనొప్పి వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. మరోవైపు అంజీరను తరచూ ఎక్కువగా తీసుకుంటే ఇందులో ఉండే ఆక్సిలేట్ శరీరంలోని కాల్షియం కొరతను ఏర్పరుస్తుంది. మరోవైపు ఎలర్జీ వంటి సమస్యలు ఉన్న వారు అంజీరను అస్సలు తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అంజీర గింజలు పేగుల్లో చిక్కుకుని లివర్ ను దెబ్బతినే అవకాశం ఉంటుందని అంటున్నారు.
అంజీరలో షుగర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. అందువల్ల దీనిని డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా తీసుకోవడం అస్సలు మంచిది కాదు. ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల దీనిని తీసుకుంటే ఆరోగ్యంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. ఇక సర్జరీలు జరిగి ఉన్నవారు కూడా అంజీరను తక్కవగా తీసుకుంటే మంచిది. కిడ్నీ సమస్యలు ఉన్న వారు కూడా తరచూ కాకుండా ఎప్పుడో ఒకసారి అంజీర పండ్లను తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయి.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)