Depression Superfoods: డిప్రెషన్ అనేది ఎంతో మందిలో కలిగే అవకాశం ఉంది. ఓటమి ఎదురైనప్పుడు, అనుకున్న పనులు జరగనప్పుడు ఒక్కోసారి తీవ్ర నిరాశకు గురవుతాం. అలాంటప్పుడు డిప్రెషన్‌గా అనిపిస్తుంది. ఆ సమయంలో మీరు కొన్ని ఆహారాలను తినాలి. వాటిని తినడం వల్ల మీలో డిప్రెషన్ తగ్గి ఉత్సాహం పెరుగుతుంది. డిప్రెషన్ కోసం ఉపయోగపడే కొన్ని సూపర్ ఫుడ్స్ ఉన్నాయి. వాటిలో సెలీనియం, విటమిన్ డి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఒక వ్యక్తి మానసిక శ్రేయస్సును కాపాడేందుకు సహాయపడతాయి. ఎలాంటి ఆహారాలను తినాలో తెలుసుకోండి. వాటిని ఎప్పుడూ మీ దగ్గరలో ఉంచుకోవడం ఉత్తమం.
కాఫీ
కాఫీ మీలో ఉత్సాహాన్ని నింపడానికి ఉపయోగపడుతుంది. డిప్రెషన్, పానిక్ డిజార్డర్ వంటివి తగ్గించడానికి సహాయపడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం కాఫీని తాగడం వల్ల వెంటనే డిప్రెషన్ సాయిలు తగ్గుతాయి. అలా అని ఎక్కువ తాగితే మాత్రం డిప్రెషన్ మరింత పెరిగిపోయే అవకాశం ఉంది. ఎప్పుడైనా కాస్త నిరుత్సాహంగా, నిరాశగా అనిపించినప్పుడు ఒక కప్పు కాఫీ తాగండి చాలు.
సాల్మన్ చేపలు
సాల్మన్ చేపల్లో పాలీఅన్ శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి డిప్రెషన్‌తో పోరాడేందుకు సహాయపడతాయి. వీటిలో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి మెదడు కణాలను ప్రభావితం చేస్తాయి. మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.
ఆకుపచ్చని కూరగాయలు
ఆకుపచ్చగా ఉండే కూరగాయలు, ఆకుకూరలు వంటివి ఫోలేట్‌తో నిండి ఉంటాయి. ఫోలేట్ మెదడుకు అత్యవసరమైనవి. మెదడు కణాలు బాగా పనిచేయాలంటే ఫోలేట్ అవసరం. ఇలాంటి గ్రీనీ లీఫ్ వెజిటబుల్స్ తినడం వల్ల డిప్రెషన్‌కు వ్యతిరేకంగా పోరాడవచ్చు.
పాలు
ప్రతిరోజు కప్పు పాలు తాగడం అలవాటు చేసుకోండి. ఇది డిప్రెషన్ రాకుండా అడ్డుకుంటుంది. దీనిలో విటమిన్ డి అధికంగా ఉంటుంది. కాబట్టి నిరాశ, నిస్పృహ వంటివి కలగకుండా పాలు అడ్డుకుంటాయి. నార్వేలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం విటమిన్ డి అధికంగా ఉన్నవారిలో డిప్రెషన్ వచ్చే ఛాయలు చాలా వరకు తగ్గుతున్నాయి.
బ్రెజిల్ నట్స్
బ్రెజిల్ నట్స్ అనేవి ఇప్పుడు సూపర్ ఫుడ్స్ లో చేరిపోయాయి. వీటిని ఆన్ లైన్ లో కొనుక్కోవచ్చు. ఈ బ్రెజిల్ నట్స్ ఎప్పుడూ మీతో పాటు కొన్ని ఉంచుకోండి. వీటిని తినడం చాలా సులువు. ఈ చిన్న గింజలను తినడం వల్ల మనకు సెలీనియం పుష్కలంగా అందుతుంది. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శక్తి కూడా అందుతుంది. అలా అని మరీ అధికంగా వీటిని తినకండి. రోజుకు ఒక గుప్పెడు బ్రెజిల్ నట్స్ తింటే చాలు. కావాల్సినంత సెలీనియం మీ శరీరానికి చేరుతుంది. సెలీనియం కోసం బ్రౌన్ రైస్, సన్ ఫ్లవర్ సీడ్స్, సీ ఫుడ్ వంటివి కూడా తినవచ్చు. సెలీనియం పుష్కలంగా ఉంటే మానసిక ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది.
Share