Ayurvedic Remedies For Indigestion: జీర్ణ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దీని వల్ల నాణ్యమైన జీవితాన్ని గడపలేని పరిస్థితి ఏర్పడుతుంది. తిన్న ఆహారం జీర్ణం కాకపోతే జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయడం లేదని చెప్పవచ్చు. ఇవి జీర్ణాశయాంతర వ్యాధులకు కారణమవుతుంది. అజీర్ణం రోజువారి జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల కడుపు నొప్పి గుండెల్లో మంట, వికారం, ఆకలి లేకపోవడం, నిద్ర సమస్యలు, గ్యాస్ మొదలైన సమస్యలు కూడా వస్తాయి.
అజీర్ణం కారణాలు:
అజీర్ణం అనేక కారణాల వల్ల వస్తుంది. ఇది ప్రధానంగా అతిగా తినడం, సరిగ్గా నమలకుండా తినడం, వేగంగా తినడం, అధికంగా కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారం తినడం, అసహనం, ఒత్తిడి, అధిక ధూమపానం, మద్యపానం వల్ల కూడా వస్తుంది. మీరు ఎక్కువగా తింటున్నట్లయితే అది కడుపుపై బరువును కలిగిస్తుంది. అది అజీర్ణానికి కూడా కారణం అవుతుంది. అలాంటి వాటిని వీటి ద్వారా తగ్గించుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
అల్లం:
కడుపులోని ఆమ్లాన్ని తగ్గించుకోవడానికి అల్లం ఉపయోగపడుతుంది. అల్లం మంచి ఎఫెక్టీవ్ హోం రెమెడీ అని చెప్పవచ్చు. అల్లం టీ తీసుకోవడం ద్వారా మీరు దీని నుంచి సత్వర ఉపశమనాన్ని పొందవచ్చు.
చిన్న అల్లం ముక్కను వేడి నీటిలో వేసి ఐదు నిమిషాలు ఉడకబెట్టండి. దీని తర్వాత వడకట్టి దానిలో కొద్దిగా నిమ్మరసం, తేనె జోడించి త్రాగండి. అల్లం ముక్కలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఆ నీటిని వడకట్టి అందులో తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే జీర్ణశక్తి చాలా వరకు మెరుగుపడుతుంది.
సోంపు:
సోంపు కడపుకు ఉపశమనం కలిగిస్తుంది. ఉబ్బరం, వికారం,కడుపు నొప్పి, జీర్ణాశయాంతర సమస్యలను కూడా తగ్గిస్తుంది. సోంపు టీ తయారుచేసుకొని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వేడి నీటిలో ఒక చెంచా సోంపు వేసి 10 నిమిషాలపాటు ఉడికించి దానిని వడకట్టి తాగాలి. ఇది జీర్ణ సమస్యను తగ్గిస్తుంది.
లెమన్ వాటర్:
నిమ్మ రసంలో ఉండే అల్కలైన్ గుణాలు జీర్ణ శక్తిని పెంచుతాయి. ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక చెంచా నిమ్మరసం కలిపి తాగాలి. భోజనానికి ముందు ఇది తీసుకుంటే జీర్ణ క్రియకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
Also Read:పాప్‌కార్న్ ఇష్టంగా తింటున్నారా.. అయితే మీకు ఈ కష్టం తప్పదు
యాపిల్ సైడర్ వెనిగర్:
యాపిల్ సైడర్ వెనిగర్ వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. అజీర్ణ సమస్యలను కూడా ఇది దూరం చేస్తుంది. అంతేకాకుండా చర్మ ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది, ఒక కప్పు నీటిలో రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ వేసి తాగడం మంచిది. భోజనానికి 30 నిమిషాల ముందు ఇది తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)