
Beauty Tips For Face : వయసు పెరిగినా అందంగా, యవ్వనంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి! యవ్వనపు మెరుపు కోసం రెగ్యులర్‌గా బ్యూటీ పార్లర్ల చుట్టే కాకుండా రాత్రి పడుకుతనే ముందు ఈ టిప్ ఫాలో అయితే చాలు.. మీ అందం రెట్టింపు అవుతుంది. అదెలాగో చూద్దాం రండి.
మెరుపునిచ్చే బాదం..
4 బాదం పప్పులు, 2 స్పూన్ల వేపుడు శనగపప్పు, ఒక స్పూన్ అవిసె గింజలు వేసి మెత్తని పౌడర్‌లా చేసుకోవాలి. దానికి కొద్దిగా పాలు, రోజ్ వాటర్ మిక్స్ చేసుకుని రాత్రి పడుకునే ముందు ముఖానికి, మెడకు పట్టించి 15 నిమిషాల తర్వాత తుడుచుకుంటే సరి. మెరిసే అందం మీ సొంతం.
హైడ్రేట్ చేయండి..
బాడీ హైడ్రేట్ అయ్యేందుకు కేవలం నీళ్లు మాత్రమే బాడీకి కావాల్సినంత నీరు ఇవ్వదు. దీనికి కొన్ని రకాల వెజ్జీస్, విత్తనాలు కూడా తీసుకోవాలి. నిద్రపోయిన తర్వాత అవి బాడీని హైడ్రేట్ చేసి, చర్మం పొడిబారకుండా చేస్తుంది. పైగా తేమను అందిస్తుంది.