
Face Care Tips : పాలలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. పచ్చిపాలతో ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. అందాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చు. చర్మ సౌందర్యం కోసం బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ బోలెడు డబ్బులు ఖర్చు పెట్టు బదులు ఇంట్లో ఉండే పదార్థాలతోనే ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
పచ్చిపాలు, తేనె మాస్క్..
పచ్చి పాలు, తేనె చర్మానికి తేమనిస్తుంది. రెండు చెంచాల పచ్చిపాలు, ఒక చెంచా తేనె కలిపి ఆ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కాటన్ బాల్స్‌తో శుభ్రం చేసుకోవాలి. కొద్ది సేపటికి చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది.
పచ్చిపాలు, అరటి పండు మాస్క్..
పచ్చి పాలలో అరటి పండును కలిపితే అది చర్మానికి మరింత మేలు చేస్తుంది. దీని కోసం కొద్దిగా పచ్చిపాలు, సగం అరటి పండు వేసి మెత్తగా కలపాలి. ఆ పేస్ట్‌ను ముఖంపై అప్లై చేసి 20నిమిషాల తర్వాత కడిగేసుకుంటే సరి.