Beauty Tips: ముఖంపై మొటిమలు, మచ్చలు వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు కలబందతో వాటిని పోగొట్టుకోవచ్చు. కలబందను ఆయుర్వేదంలో వందలు ఏళ్ళుగా ఉపయోగిస్తున్నారు. ఇది చర్మ సంరక్షణలో ముఖ్యపాత్ర వహిస్తుందని ఆయుర్వేదం కూడా చెబుతోంది.
కలబంద ఒక విచిత్రమైన ఆకు. దాని ఆకులలోనే జెల్ లాంటి తేమను ఎక్కువగా నిలువ చేస్తుంది. ఆకుల మధ్యలో ఉండే జెల్‌లో విటమిన్లు, ఖనిజాలు,యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే దీనిలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ బి12, కొన్ని కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. అందుకే ఇవి చర్మాన్ని కాపాడడంలో ముందుంటాయి. కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియా గుణాలు కూడా ఎక్కువ. కాబట్టి మచ్చలను పోగొట్టడంలో కలబంద ముందుంటుంది.
కలబంద జెల్‌ను చర్మానికి రాయడం వల్ల అది సహజంగానే రిపేర్ మెకానిజం ప్రేరేపిస్తుంది. చర్మం ఆరోగ్యకరమైన ఆకృతికి వచ్చేలా చేస్తుంది. దీనిలో రెండు ముఖ్యమైన ప్రోటీన్ల సంశ్లేషణకు బాధ్యత వహించే హార్మోన్లను ప్రేరేపిస్తుంది. ఆ హార్మోన్లు కొలాజెన్, ఎలాస్టిక్ ఈ రెండూ చర్మ ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనవి.
కొంతమందిలో హైపర్ పిగ్మెంటేషన్ సమస్య ఉంటుంది. చెంపలపై నిత్యం మొటిమలు వస్తూనే ఉంటాయి. మొటిమలు వచ్చే ప్రాంతంలో కలబంద రసాన్ని రాయడం వల్ల అవి త్వరగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే కలబందలో విటమిన్ సి, విటమిన్ ఇ ఉంటాయి. ఇవి మచ్చలను హైపర్ పిగ్మెంటేషన్ తగ్గిస్తాయి. చర్మం గుంతలు పడకుండా కాపాడతాయి. చిన్న తేమవంతంగా ఉంటే చర్మంపై మొటిమలు రాకుండా ఉంటాయి. కలబంద రసాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. అలోవెరా జెల్ లో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలు, నలుపు మచ్చలను తగ్గిస్తాయి.
Also Read: తేనెతో ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. వారం రోజుల్లో ముడతలు మాయం
కలబంద జెల్‌ను సేకరించడానికి ముందుగా ఒక ఆకును మధ్యకు చీల్చండి. చేతులు శుభ్రపరచుకొని దాని నుండి జెల్ ను ఒక స్పూన్ తో బయటకు తీసి చిన్న గిన్నెలో వేసుకోండి. ఆ జెల్‌ను వేలితో తీసి చెంపలపై వృత్తాకారంగా మసాజ్ చేయండి. ఇది చర్మం లోనికి పీల్చుకునేందుకు ఒక అరగంట లేదా గంట పాటు వదిలేయండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో చర్మాన్ని శుభ్రపరచుకొని వెంటనే టవల్ తో తుడుచుకోండి. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల కలబంద ప్రభావంతంగా పనిచేస్తుంది.
తాజా కలబంద రసాన్ని చిన్న గిన్నెలో తీసుకోండి. అందులో పావు స్పూను నిమ్మరసం కూడా వేయండి. ఆ రెండింటిని బాగా కలిపి మచ్చలు వస్తున్నచోట రాయండి. ఒక పావుగంట సేపు వదిలేయండి. ఆ మచ్చలు కొన్నాళ్లకే త్వరగా మాయం అయిపోతాయి. అలోవెరా జెల్‌లో తేనె కలిపి ముఖానికి పట్టించడం వల్ల కూడా మచ్చలు మాయమైపోతాయి. ఇలా పట్టించాక గోరువెచ్చని నీటితో చర్మాన్ని కడుక్కోవాలి. వారానికి రెండు మూడు సార్లు ఈ ప్యాక్ ను అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
విటమిన్ ఈ క్యాప్సూల్‌ను తీసుకొని కట్ చేసి లోపల ఉన్న పౌడర్‌ను చిన్న పాత్రలో వేయండి. అందులోనే కలబంద జెల్‌ను కూడా వేసి బాగా కలిపి మచ్చలు, మొటిమలు ఉన్నచోట అప్లై చేయండి. విటమిన్ ఇ అనేది యాంటీ ఆక్సిడెంట్. ఇది చర్మ సమస్యలను త్వరగా నయం చేస్తుంది. వీలైతే రాత్రంతా అలాగే ఉండనిచ్చి ఉదయాన్నే శుభ్రపరచుకోండి. ఇలా తరచూ కలబంద రసాన్ని వాడడం వల్ల చర్మ సమస్యలు తొలగిపోతాయి.