EPAPER

Vertigo Symptoms: తరచూ కళ్ళు తిరిగినట్టు, మైకం కమ్మినట్టు అనిపిస్తోందా? అయితే మీకు వెర్టిగో ఉందేమో

Vertigo Symptoms: తరచూ కళ్ళు తిరిగినట్టు, మైకం కమ్మినట్టు అనిపిస్తోందా? అయితే మీకు వెర్టిగో ఉందేమో

Vertigo Symptoms: మీరు కూర్చున్న చోటే మీ చుట్టూ ఉన్న ప్రపంచం తిరుగుతున్నట్టు, మైకం కమ్మినట్టు, మీరు కింద పడిపోతున్నట్టు అనిపిస్తోందా? ఈ లక్షణాలు తీవ్రంగా కనిపిస్తే వెంటనే వైద్యుల వద్దకు వెళ్లి వెర్టిగో ఉందేమో చెక్ చేసుకోండి. ఎందుకంటే వెర్టిగో ఉన్న వారిలో తీవ్రంగా కళ్ళు తిరగడం, మైకం కమ్మడం, చుట్టూ ఉన్న ప్రపంచం తిరుగుతున్నట్టు అనిపించడం జరుగుతుంది. వారికి వారానికి ఒక్కసారైనా ఇలా వెర్టిగో వచ్చే అవకాశం ఉంటుంది. అందరికీ ఇలా రావాలని లేదు, వెర్టిగో ఉన్న వారిలో 44 శాతం మంది వారానికి ఒకసారి ఇలా కళ్ళు తిరిగినట్టు, మైకం కమ్మినట్టు అనుభూతిని చెందుతారు.


వెర్టిగో బాధితులు

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది వెర్టిగో బారిన పడుతున్నారు. ఇది వారి సాధారణ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ప్రతి పదిమందిలో ఒకరికి వెర్టిగో ఉంటుంది. మన దేశంలో దాదాపు 70 మిలియన్ల మందికి వెర్టిగో ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే వీరిలో ఎంతోమంది వైద్య సహాయం తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. మరి కొంతమందికి అది వెర్టిగో అని కూడా తెలియదు.


వైద్యనిపుణులు చెబుతున్న ప్రకారం భారతదేశంలో వెర్టిగో అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఎంతోమంది నీరసం వల్ల కళ్ళు తిరుగుతున్నాయి అనుకుంటారు కానీ అది వెర్టిగో అని గుర్తించలేకపోతున్నారు. రోగ నిర్ధారణకు ఆసుపత్రికి కూడా వెళ్లడం లేదు. దీనివల్ల వారికి వికారం, వాంతులు కావడం, భ్రమలు కలగడం వంటివి జరుగుతున్నాయి.

వెర్టిగో లక్షణాలు

మైకం కమ్మినప్పుడు తేలికగా అనిపిస్తుంది. బలహీనంగా వణుకుతున్నట్టు ఉంటుంది, నడవలేరు. మీ శరీరం మీ అదుపులో ఉండదు. చుట్టూ ఉన్న వస్తువులన్నీ మీ చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తాయి. కొన్ని నిమిషాల పాటు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సంకేతాలు కనిపిస్తే కొంతమంది రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గాయని, రక్తపోటు తగ్గిందని, డీహైడ్రేషన్ ప్రభావం అని, ఒత్తిడి వల్ల ఇలా కలిగిందని ఊహించుకుంటూ ఉంటారు. అలా ఊహించుకోకుండా వైద్యుని వద్దకు వెళ్లి తగిన రోగనిర్ధారణ చేసుకొని మందులు వాడడం చాలా మంచిది.

మైకం అనేది కేవలం వెర్టిగో వల్లే కాదు ఇతర అంతర్లీన అనారోగ్య సమస్యల వల్ల కూడా కలగవచ్చు. కాబట్టి తల తిరిగినట్టు అనిపిస్తే నిర్లక్ష్యం వహించకుండా అది ఎందుకు వచ్చిందో తెలుసుకునేందుకు ప్రయత్నించండి.

Also Read: స్త్రీలతో పోలిస్తే పురుషుల్లోనే గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయి, ఎందుకు?

వెర్టిగో ఎక్కువగా 41 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య వారిలో కనిపిస్తుంది. వృద్ధుల్లో కూడా ఇది కనిపించే అవకాశం ఎక్కువే. మూర్ఛ వచ్చినట్టు అనిపిస్తుంది. కొంతమంది అలా ఉన్నచోటనే పడుకుండిపోతారు. వారికి తమ శరీరంపై పట్టు ఉండదు. చేయి, కాలు కూడా కదపలేరు.

వెర్టిగోకు చికిత్స చేయడం సులభమే. వైద్యున్ని సంప్రదిస్తే అందుకు తగిన చికిత్సా ప్రణాళికను మీకు ఆయన అందిస్తారు. వెర్టిగో ఉన్నవారు స్లీపింగ్ పొజిషన్ ఎంచుకోవాలి. తలను కాస్త ఎత్తుగా పెట్టి నిద్రించడం వల్ల వెర్టిగో లక్షణాలు తగ్గుతాయి. పక్కకు తిరిగి పడుకోవడం మానేయాలి. యోగా, నడకా వంటి సున్నితమైన వ్యాయామాలు చేస్తూ ఉండాలి. ఇవి వెర్టిగో లక్షణాలను తగ్గించే శక్తిని కలిగి ఉంటాయి.

వెర్టిగో మరీ తీవ్రంగా ఉంటే వెస్ట్ బ్యులర్ రిహాబిలిటేషన్ థెరపీని సూచిస్తారు. అలాగే కొన్ని మందులను కూడా ఇస్తారు. శస్త్ర చికిత్స కూడా కొన్నిసార్లు అవసరం పడవచ్చు. కానీ శస్త్ర చికిత్స అనేది చాలా అరుదుగా చేస్తారు.  కాబట్టి దాదాపు మందులు, జీవనశైలి మార్పులు, థెరపీల ద్వారానే వెర్టిగోని తగ్గించేందుకు వైద్యులు సహాయపడతారు. వెర్టిగో ఉన్నవారు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ప్రశాంతంగా జీవించేందుకు ప్రయత్నించాలి. కుటుంబంతో ఆనందంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి.

పెరిగిపోతున్న ఒత్తిడి,  టెన్షన్లు వెర్టిగోను మరింతగా పెంచేస్తాయి. రోజులో కాసేపు ప్రశాంతంగా మీ కోసం మీరు సమయాన్ని కేటాయించుకోవాలి. ఆ సమయంలో మీ మనసుకు ఇష్టమైన పనులు చేసేందుకు ప్రయత్నించండి. ఒత్తిడిని, మానసిక ఆందోళనలను దగ్గరకు రాకుండా జాగ్రత్త పడండి. మొక్కలు పెంచడం, నచ్చిన పుస్తకాలు చదవడం, పెయింటింగులు వేయడం ఇలాంటివి చేస్తూ ఉండండి. అధిక శబ్దాలతో సినిమాలు చూడడం, తీవ్రభయాందోళనలకు, మానసిక కల్లోలాలకు కారణమయ్యే సినిమాలు సీరియల్స్ చూడడం మానేయండి. ఇవన్నీ కూడా మీ మానసిక ఆరోగ్యం పై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి.

Related News

Panasa Curry: ఆవపెట్టిన పనస కూర ఇలా వండారంటే ఆ రుచికి ఎవరైనా దాసోహమే, రెసిపీ తెలుసుకోండి

Hibiscus Hair Mask: మందారంలో వీటిని కలిపి ఈ హెయిర్ మాస్క్ ట్రై చేశారంటే.. పట్టులాంటి జుట్టు మీ సొంతం

Instant Glow Facial: పండుగ వేళ.. ఇంట్లో దొరికే వస్తువులతో ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. ఇన్‌స్టంట్‌ గ్లో ఖాయం

Relationships: మీ మాజీ లవర్‌తో ఇప్పటికీ స్నేహంగా ఉంటున్నారా? ఇది మంచి ఆలోచనేనా?

Amla Rice: ఉసిరికాయ అన్నం ఇలా చేసుకొని తింటే లంచ్ బాక్స్‌కు బాగుంటుంది, ఇది ఎంతో ఆరోగ్యం కూడా

Youthful Glow: ఎప్పటికీ యవ్వనంగా ఉండాలా? డైలీ, ఈ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ తింటే చాలు.. వయస్సే తెలియదు

Rice Water: గంజి వచ్చేలా అన్నం వండి ఆ గంజినీళ్లను ప్రతిరోజూ తాగండి, మీరు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి

×