Cardamom Milk Benefits: మసాలా దినుసుల్లో యాలకులు కూడా ఒకటి. యాలకులను ఎక్కువగా స్వీట్ల తయారీలో ఉపయోగిస్తుంటారు. ఈ యాలకులలో పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయి. దీనిలో ఉండే ఔషధ గుణాలు ఆరోగ్యానికి చాలా రకాలుగా తోడ్పడతాయి. అంతేకాదు యాలకులో ఉండే విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మరోవైపు ఇందులో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
అయితే యాలకులను కేవలం వంటకాల్లో వాడడం వల్ల మాత్రమే కాకుండా వీటిని పాలతో పాటు తీసుకోవడం వల్ల పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయి. తరచూ యాలకుల పాలు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా లాభాలు ఉంటాయి. అయితే ఆ లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
యాలకుల పాలను తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాదు జీర్ణక్రియ కూడా సాఫీగా సాగుతుంది. మరోవైపు అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యల నుంచి కూడా యాలకుల పాలు ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాదు జీర్ణక్రియ రేటును కూడా పెంచేందుకు సహాయపడతాయి. యాలకులను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. యాలకుల్లో విటమిన్ సి దీనికి తోడ్పడుతుంది. మరోవైపు గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యలు ఉన్నవారు యాలకుల పాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
యాలకుల్లో ఉండే నియాసిన్, రైబోఫ్లావిన్ అనే మూలకాల వల్ల ఆరోగ్యాన్ని రక్షించేందుకు సహాపడతాయి. ఇక యాలకులతో గుండె ఆరోగ్యాన్ని కూడా రక్షించుకోవచ్చు. యాలకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాశాలను శుభ్రపరుస్తాయి. దీంతో రక్తపోటు వంటి ప్రమాదకర సమస్యలను నియంత్రించేందుకు సహాయపడతాయి.
యాలకులను తీసుకోవడం వల్ల శ్వాసకోశ సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. ఇక అస్తమా, గొంతు నొప్పి వంటి సమస్యలు ఉన్న వారు యాలకుల పాలను తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు కూడా చెబుతున్నారు. అంతేకాదు అధిక బరువు వంటి సమస్యలు ఉన్నవారు కూడా యాలకుల పాలను తీసుకుంటే పొట్టలో కొవ్వును కరిగించి, శరీరంలోని పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించి గుండె సమస్యల నుంచి రక్షిస్తుంది.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)