
Tips For Regular Periods : మారిన జీవనశైలి,ఆహారపు అలవాట్లు కారణంగా చాలా మంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌తో ఇబ్బంది పడుతున్నారు. సమయానికి పీరియడ్స్ రాక ఇతర సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. అయితే పీరియడ్స్ సమయానికి రెగ్యులర్‌గా రావాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
సరైన బరువు..
బరువు తక్కువైనా లేదా ఎక్కువైనా అనేక సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా పీరియడ్స్ సమయానికి రావు. రెగ్యులర్‌గా వర్కౌట్ చేయడం, బరువును మెయింటేన్ చేయడం వల్ల కూడా రెగ్యులర్ పీరియడ్స్‌ను పొందవచ్చు.
పోషకాహారం..
పోషకాహారం తీసుకుంటే.. పీరియడ్స్ సమయానికి వస్తాయి. ముఖ్యంగా పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్స్‌ను తీసుకోవాలి.దీంతో పీరియడ్స్‌లో వచ్చే నొప్పి కూడా తగ్గుతుంది.
కాఫీ తీసుకోవాలి..
కాఫీలో ఉండే కెఫీన్ ఈస్ట్రోజెన్ హార్మోన్‌ను స్థిరంగా ఉంచుతుంది. కాఫీ తాగడంతో పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తాయి. ఆ సమయంలో వచ్చే నొప్పి కూడా నియంత్రణలో ఉంటుంది.
నట్స్, ఖర్జూరం..
బాదం, వేరుశెనగ వంటి నట్స్‌లో ఉండే ఫైబర్, ప్రోటీన్ వల్ల రెగ్యులర్ పీరియడ్స్‌ను పొందవచ్చు.అలాగే ఖర్జూరం శరీరంలో ఉష్ణోగ్రతను పెంచి పీరియడ్స్ సమయానికి వచ్చేలా చేస్తాయి.