Tips For Healthy Bones: మన శరీరం మొత్తానికి ఎముకలే ఆధారం. అలాంటి ఎముకలను బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. వయస్సు పెరుగుతున్న కొద్దీ కీళ్లలో అనేక రకాల సమస్యలు వస్తాయి. ఇది సాధారణంగా శరీరంలో కాల్షియం లేకపోవడం వల్ల కీళ్లనొప్పులు వంటి సమస్యల వల్ల కూడా వస్తుంటాయి. ప్రస్తుతం చాలా మంది వయస్సుతో సంబంధం లేకుండా కీళ్ల నొప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇందుకు సంబంధించిన శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్న వారు కూడా చాలా మందే ఉన్నారు. ఇలాంటి పరిస్థితి రాకుండా.. ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. ఎముకలు బలంగా ఉండటానికి సంబంధించిన కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కీళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి ?
వయస్సు పెరిగే కొద్దీ కీళ్లలో మృదులాస్థి క్షీణించడం ప్రారంభమవుతుంది. దీని వల్ల ఎముకల్లో శబ్దం రావడం మొదలవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కీళ్లలో నొప్పి, వాపు కారణంగా కూడా ఇది జరగుతుంది. కండరాలలో ఒత్తిడి కారణంగా కీళ్ల నొప్పి వస్తుంది.
ఎముకలు దృఢంగా ఉండేందుకు చిట్కాలు..
మనం తినే ఆహారంలో కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను చేర్చడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. పాలు, పెరుగు, చీజ్, సోయాబీన్, ఆకుకూరలు, బాదం మొదలైన వాటిలో కాల్షియం పుష్కలంగా ఉంటాయి.
విటమిన్ డి: సూర్యకాంతి, చేప నూనె, గుడ్లలోని పచ్చసొన మొదలైన వాటిలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ డి కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది.
ప్రోటీన్లు: పప్పులు, మాంసం, గుడ్లు, చేపలు మొదలైనవి ప్రొటీన్లకు మంచి వనరులు. ఎముకలు బలంగా ఉండటానికి ప్రోటీన్ సహాయపడుతుంది. తరుచుగా ప్రొటీన్ రిచ్ ఫుడ్ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి.
ఫైబర్: పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మొదలైనవి ఫైబర్ యొక్క మంచి వనరులు. ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా కాల్షియం శోషణను ప్రోత్సహిస్తుంది.
రెగ్యులర్ వ్యాయామం: వెయిట్ లిఫ్టింగ్, యోగా, వాకింగ్ వంటి వ్యాయామాలు ఎముకలను బలోపేతం చేస్తాయి.
సూర్యకాంతి: ప్రతిరోజు కొంత సమయం పాటు సూర్యకాంతిలో కూర్చోవడం వల్ల ఎముకలకు అవసరమైన విటమిన్ డి లభిస్తుంది.
ఒత్తిడిని తగ్గించండి: ఒత్తిడి ఎముకలను బలహీనపరుస్తుంది. కాబట్టి యోగా, ధ్యానం లేదా ఇతర ఒత్తిడిని తగ్గించే పనులు చేయండి.
Also Read: ఈ టీతో మీ అనారోగ్య సమస్యలన్నీ పరార్ !
తగినంత నిద్ర : నిద్రలో శరీరం ఎముకలను రిపేర్ చేస్తుంది. అందుకే రోజులో శరీరానికి తగినంత నిద్ర పోవడం అవసరం.
మద్యపానం : ధూమపానం, మద్యం ఎముకలను బలహీనపరుస్తాయి. వీలైనంత వరకు వీటిని తగ్గించకుంటే మంచిది.
నువ్వులు: నువ్వులలో కాల్షియం, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి.
బెల్లం: బెల్లంలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పాలల్లో బెల్లం కలిపి తినడం వల్ల శరీరానికి అవసరమైన కాల్షియం లభిస్తుంది. ఫలితంగా ఎముకలు కూడా బలంగా ఉంటాయి.
అంజీర్: వీటిలో కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో తినాలి.ఇలా తరుచేగా తినడం వల్ల శరీరానికి క్యాల్షియం అంది ఎముకలు బలంగా తయారవుతాయి.
(గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)