Big Stories

Egg Hair Mask: ఎగ్ తో ఇలా మాస్క్ వేస్తే.. ఒత్తైన జుట్టు మీ సొంతం !

Egg Hair Mask: నేటి తరం ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యల్లో హెయిర్ ఫాల్ కూడా ఒకటి. దీనికోసం మార్కెట్లో ఎన్నో రకాల మందులు, ట్రీట్మెంట్లు ఉంటాయి. కానీ సహజ పోషణ అనేది హెయిర్ ఫాల్ ను తగ్గించడానికి చాలా అవసరం. ఇది ప్రభావవంతమైన మార్గం కూడా.. ఎందుకంటే మార్కెట్లో దొరికే రకరకాల ఉత్పత్తుల కారణంగా ప్రస్తుతం జుట్టు ఊడిపోవడం తగ్గినా భవిష్యత్తులో వాటి వల్ల ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది.

- Advertisement -

వెంట్రుకల సంరక్షణ పోషణ కోసం సహజ పోషణకు మొగ్గు చూపడం అవసరం. ఇందుకు మీరు తప్పకుండా పనికొచ్చేది గుడ్డు. గుడ్లలో ప్రోటీన్లు. విటమిన్లు. మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శిరోజాలకు మంచి పోషణను కలిగిస్తాయి. అంతేకాకుండా వెంట్రుకలను కుదుళ్ల నుంచి బలోపేతం చేసి పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తాయి. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒకటే అది హెయిర్ మాస్క్.

- Advertisement -

ప్రయోజనాలు:
జుట్టు సంరక్షణకు గుడ్డు తిరుగులేని పదార్థం. వెంట్రుకలను కుదుళ్ల నుంచి చివర్ల వరకు బలంగా చేసేందుకు సహాయపడే ప్రోటీన్లు, న్యూట్రీషియన్లు పోషకాలు గుడ్డులో అధికంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ, డి, ఇ స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. గుడ్డులో ఉండే ప్రోటీన్ జుట్టును మెరిసేలా చేస్తుంది. అంతేకాకుండా గుడ్డులోని పచ్చసొన పొడిగా నిర్జీవంగా ఉన్న వెంట్రుకలకు బాగా సహాయపడతుంది. చుండ్రును తగ్గించేందుకు చిట్లిపోయిన జుట్టు రిపేర్ చేసేందుకు మంచి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది.
ఎలా తయారు చేసుకోవాలి:
మీ జుట్టును బట్టి ఒకటి లేదా రెండు గుడ్లు తీసుకోండి. పొట్టి జుట్టు ఉన్నవారికైతే ఒక గుడ్డు సరిపోతుంది. ఒక గుడ్డులోని పచ్చసొన, తెల్లసొనను వేరు చేయాలి. జిడ్డు జుట్టు ఉన్న వారైతే గుడ్డులోని తెల్లసొనను మాత్రమే ఉపయోగించడం మంచిది. వెంట్రుకలు పొడిగా ఉండేవారు పచ్చ సొనను కూడా వాడితే మరింత ప్రయోజనం ఉంటుంది. తీసుకున్న గుడ్డును నురగ వచ్చేవరకూ బాగా గిలకొట్టాలి అంతే మిశ్రమం రెడీ అయినట్లే.
ఎలా అప్లై చేయాలి:
తయారు చేసుకున్న మిశ్రమాన్ని తలకు పట్టించి ముందు గోరువెచ్చని నీటితో తల వెంట్రుకలను పూర్తిగా తడపాలి. దాని వల్ల గుడ్డులోని పోషకాలు వెంట్రుకలను కుదుళ్లు బాగా గ్రహిస్తాయి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని బ్రష్ లేదా చేతితో వెంట్రుకలకు పట్టించి చివరల వరకూ మసాజ్ చేయాలి. మసాజ్ చేయడం వల్ల తలలో రక్తప్రసరణ పెరిగి పోషకాలను గ్రహించడానికి ఇది దోహదం చేస్తుంది. తలంతా దీన్ని అప్లై చేసుకున్న తర్వాత మీ జుట్టును కవర్ తో కప్పి తేమ బయటకు పోకుండా ఉండేందుకు టవల్ తో కప్పి ఉంచాలి. ఎగ్ మిశ్రమం త్వరగా ఆరిపోకుండా ఉండేందుకు ఇది సహాయపడుతుంది.

ఇలా 20 నుంచి 30 నిమిషాల పాటు గుడ్డు మిశ్రమాన్ని తలకు ఉంచిన తర్వాత గోరు వెచ్చని లేదా చల్లని నీటితో షాంపు అప్లై చేసి కడిగేయండి. వేడి నీటితో అస్సలు చేయకూడదని గుర్తుంచుకోండి. వేడి నీటితో వాష్ చేయడం వల్ల మీరు రాసుకున్న గుడ్డు విశేషాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అంతే వారానికి ఒకసారి ఇలా చేసుకుంటే మీ వెంట్రుకలు బలంగా మెరిసేలా తయారవుతాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News