
Water Heater : ఈ చలికాలంలో పిల్లలకైనా.. పెద్దలకైనా చన్నీటి స్నానం ఇష్టం ఉండదు. దీంతో చాలామంది ఇంట్లో వాటర్ హీటర్‌ను వాడుతుంటారు. అయితే, హీటర్‌ను వాడేటప్పుడు ఆదమరిస్తే అంతే సంగతులు. మరి వాటర్ హీటర్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దామా!
- తక్కువ నాణ్యత కలిగిన వాటర్ హీటర్‌ను కొనకపోవడమే మంచిది. ఎందుకంటే అవి ఎక్కువ కాలం పనిచేయవు.
- వాటర్ హీటర్ వాడే సందర్భంలో ఐరన్ బకెట్‌ను వాడకూడదు. అవి విద్యుత్ వాహకాలు. కాబట్టి ప్లాస్టిక్ బకెట్ వాడండి.
- హీటర్ మొత్తాన్ని నీటిలో ముంచకుండా ఇండికేటర్ వరకే నీటిలో మునిగేలా పెట్టుకోవాలి. అప్పుడప్పుడు హీటర్‌ను క్లీన్ చేయాలి.
- హీటర్‌ను వాటర్‌లో పెట్టిన తరువాతే స్విచ్ వేయాలి. ముందే స్విచ్ వేస్తే.. కరెంట్ షాక్ కొట్టే ప్రమాదం ఉంది.
- ముఖ్యంగా పిల్లలను వాటర్ హీటర్‌కు దూరంగా ఉంచాలి. అంతేకాకుండా హీటర్‌తో నీటిని ఎక్కువ వేడి చేయడం అంత మంచిది కాదు.