Health Problems: ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా యుగం వల్ల చాలా మంది సెల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. సెల్ ఫోన్ ఉండి అందులో డేటా ఉంటే చాలు. మరే ప్రపంచాన్ని పట్టించుకోవడం లేదు. సెల్ ఫోన్లో ఉండే సోషల్ మీడియాలో తరచూ గంటల తరబడి గడిపేస్తున్నారు. ఈ తరుణంలో సమయంతో పాటు నిద్ర, తిండి కూడా సరిగా తీసుకోవడం లేదు. రాత్రిళ్లు కూడా సరిగా నిద్రపోకుండా సెల్ ఫోన్లోనే గడిపేస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల చాలా మంది తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అయితే మనిషి శరీరంలోని అవయవాలు సక్రమంగా పని చేయాలంటే సరైన నిద్ర అవసరం ఉంటుంది.
సరైన నిద్ర లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. రాత్రంతా ఫోన్ చూసి కేవలం 3 నుంచి నాలుగు గంటల పాటు నిద్రించి సరిపెట్కటుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ప్రతీ రోజూ 7 నుంచి 9 గంటల పాటు నిద్ర అనేది అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు. అయితే నిద్రలేమి వల్ల కలిగే సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిద్రలేమి సమస్య అనేది ప్రస్తుతం సాధారణంగా మారిపోయింది. దీని వల్ల శరీరంలోని హార్మోన్లు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అంతేకాదు బరువు కూడా పెరుగుతారని అంటున్నారు. అంతేకాదు గుండె సంబంధింత సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మరోవైపు రక్తపోటు వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి.
అంతేకాదు నిద్ర సరిగా లేకపోతే గుండె పోటు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. గుండెలో మంట కూడా ఏర్పడుతుంది. ఇక దీర్ఘకాలిక జబ్బుల బారిన కూడా పడతారు. మరోవైపు జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల నిద్ర ఎక్కువ సేపు ఉంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. రోజంతా శ్రమించడం వల్ల సరైన నిద్ర లేకపోతే శరీరం ఒత్తిడికి గురి కావాల్సి ఉంటుంది. ఇక డయాబెటీస్ వంటి సమస్యలు ఉన్న వారు కూడా నిద్రసరిగా లేకపోతే తీవ్ర అనారోగ్యం పాలు కావాల్సి ఉంటుంది.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.