Foods For Children: పిల్లలను ఆరోగ్యంగా, బలంగా తయారు చేయడం తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలకు పోషకాహారం అందించినప్పుడే వారు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఆహారం ద్వారానే ముఖ్యంగా పిల్లల శరీరం, మనస్సు వేగంగా అభివృద్ధి చెందుతాయి. స్కూల్ ఏజ్ లోనే వారికి సరైన పోషకాలను అందించడం చాలా ముఖ్యం.
తద్వారా వారి శారీరక , మానసిక అభివృద్ధి సరిగ్గా జరుగుతుంది. అయితే ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లకు పెట్టే ఆహారం విషయంలో పెద్దగా దృష్టి పెట్టలేకపోతున్నారు. అందుకే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఒక వేళ మీరు కూడా ఇలా చేస్తే కనక ఈ అలవాటును మార్చండి . మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి వారికి ఏ పోషకాలు అందించాలి. ఎలాంటివి ఆహారంలో చేర్చాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రోటీన్:
ప్రోటీన్ కండరాల పెరుగుదల, మరమ్మత్తులో సహాయపడుతుంది. శరీరానికి శక్తిని కూడా అందిస్తుంది. పిల్లలకు రోజూ మంచి ప్రొటీన్లు ఇవ్వాలి. పాలు, పెరుగు, చీజ్, గుడ్లు, చేపలు, చికెన్, పప్పులు, సోయా, నట్స్ వంటి వాటిలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
కార్బోహైడ్రేట్లు:
పిల్లల శారీరక కార్యకలాపాలను నిర్వహించడానికి కార్బోహైడ్రేట్లు ప్రధాన శక్తి వనరులు. ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్ పిల్లలకు చాలా అవసరం ఇవి పిల్లల శారీరక, మానసిక పెరుగుదలకు సహాయపడతాయి. ఓట్స్, బ్రౌన్ రైస్ , కూరగాయలు వంటి తృణధాన్యాల్లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. వీటిని పిల్లలకు తరుచుగా ఆహారంలో బాగంగా ఇవ్వాలి.
విటమిన్లు, ఖనిజాలు:
పిల్లల శరీరంలోని వివిధ భాగాల సజావుగా పనిచేయడానికి విటమిన్లు, ఖనిజాలు అవసరం. విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ డి, కాల్షియం, ఐరన్, జింక్ వంటివి పిల్లల పెరుగుదలకు ఉపయోగపడతాయి. పిలలకు ఇచ్చే ఫుడ్ తో తప్పకుండా ఈ పోషకాలు ఉండేలా చూసుకోవాలి.
విటమిన్ ఎ:
కంటి చూపు, చర్మానికి విటమిన్ ఎ ఎంతో ఉపయోగపడుతుంది.. ఇది క్యారెట్, చిలగడదుంప, బొప్పాయి వంటి పండ్లలో లభిస్తుంది. ఈ ఫ్రూట్స్ పిల్లలకు తరుచుగా పెట్టడం ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.
Also Read: కాలేయాన్ని శుభ్రపరిచే డ్రింక్స్ ఇవే !
విటమిన్ సి:
రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ సి సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. ఇది నారింజ, నిమ్మ, జామ, బెల్ పెప్పర్‌లో ఉంటుంది. పిల్లలకు తరుచుగా ఈ ఫ్రూట్స్ ఇవ్వడం వల్ల తరుచుగా వ్యాధులు రాకుండా ఉంటాయి. అంతే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారు.
విటమిన్ డి:
ఎముకల దృఢత్వానికి విటమిన్ డి అవసరం. ఇది సూర్యరశ్మి, పాలు, పుట్టగొడుగుల వంటి ఆహారాల పదార్థాల నుంచి కూడా లభిస్తుంది. ఎముకలు, దంతాల అభివృద్ధికి ఇది అవసరం. పాలు, పెరుగు, జున్ను ఆకు కూరలు విటమిన్ డికి మంచి వనరులు. రక్తంలో హిమోగ్లోబిన్ ఏర్పడటానికి ఇది అవసరం. ఇది బచ్చలికూర, పప్పులు, బీట్‌రూట్ ,రెడ్ మీట్ ల నుంచి కూడా విటమిన్ డి లభిస్తుంది.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.