Durva grass: వినాయక చతుర్థి సెప్టెంబర్ 7వ తేదీన శనివారం నాడు రాబోతుంది. అయితే వినాయకుడి పూజలో రకరకాల పండ్లు, ఆహార పదార్థాలు, స్వీట్లు నైవేద్యంగా పెడుతుంటారు. ఇందులో ముఖ్యంగా వినాయకుడి పూజలో గరిక గడ్డి లేకుండా అసలు పూజను నిర్వహించరు. ఈ గరిక గడ్డి ప్రతీ చోట దొరుకుతుంది. ముఖ్యంగా పంట పొలాల్లో, చేలల్లో, పెరట్లో ఎక్కువగా లభిస్తుంది. అయితే సహజంగా దొరికే గరిక గడ్డిని ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. గరిక గడ్డి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
* గరిక గడ్డితో ఆరోగ్యానికి పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్న వారు గరిక గడ్డి కషాయం తాగడం వల్ల దురద, అలర్జీ వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు.
* గరిక గడ్డితో తయారుచేసే రసాన్ని తాగడం వల్ల మూత్రనాళంకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. ఈ రసంలో కాస్త నిమ్మరసం, తేనె కలుపుకుని తాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది.
* తరచూ తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు ఉన్నవారు గరిక గడ్డిని తీసుకుంటే అద్భుమైన ఫలితాలు కలుగుతాయి. అయితే గరిక గడ్డిని మెత్తగా గ్రైండ్ చేసుకుని పేస్ట్ లా తయారైన తర్వాత అందులో కాసింత నిమ్మరసం కలుపుకుని నుదుటిపై రాసుకుంటే తలనొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇలా తరచూ చేయడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు.
* పీసీఓడీ, అధిక రక్తస్రావం, రుత్రుక్రమం వంటి సమస్యలు ఉన్నవారు గరిక గడ్డితో తయారుచేసిన రసంలో కొంచెం బెల్లం కలుపుకుని తరచూ తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం పొందుతారు.
* జీర్ణ సంబంధింత సమస్యలు ఉన్నవారికి కూడా గరిక గడ్డి చాలా బాగా పనిచేస్తుంది. అజీర్ణం, మలబద్ధకం, కడుపు ఉబ్బరం, వంటి సమస్యలకు ఇది ఔషధంలా పనిచేస్తుంది.
* రక్తంలో ఉండే మలినాలు తొలగిపోవడానికి గరిక గడ్డి రసాన్ని తీసుకోవాలి. దీని కోసం ఒక గ్లాసు నీటిలో గరిక రసాన్ని కలుపుకుని తాగడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)