Guava Leaves For Skin: చిన్న వయసులోనే చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు ఎదుర్కునే సమస్యలలో మొటిమల సమస్య కూడా ఒకటి. ఈ సమస్య అనేది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొంతమందిలో మొటిమలు చిన్న సైజులో కనిపిస్తుంటాయి. మరి కొంతమందిలో ఇవి పెద్దగా ఉంటాయి. మొటిమల వల్ల ఫేస్ కళ కోల్పోతుంది. దీంతో నలుగురిలోకి వెళ్లాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. మొటిమలు, మచ్చలతో బాధపడేవారు వీటి తగ్గించుకోవడానికి ఏవేవో క్రీములు, ఫేస్ ప్యాక్‌లను వాడుతూ ఉంటారు. చిట్కాలను కూడా ట్రై చేస్తుంటారు. అయినప్పటికీ కొంతమందిలో ఎలాంటి మార్పు కనిపించకపోగా మొటిమలు కూడా మరింత ఎక్కువవుతాయి.
ఇలాంటి వారు జామ ఆకులు వాడటం వల్ల మెుటిమల సమస్యను తగ్గించుకోవచ్చు. కొన్ని చిట్కాలను ట్రై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రక రకాల ఫేస్ క్రీములు వాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో పాటు మొటిమలు మరింత ఎక్కువవుతాయి. ఇలాంటి వారు జామ ఆకులతో కొన్ని చిట్కాలు పాటించడం వల్ల మొటిమలను తగ్గించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
జామ ఆకు రసంతో..
జామ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ సెప్టిక్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గించడంలో ఎంతో సహాయ పడతాయి. కొన్ని జామాకులను తీసుకొని శుభ్రంగా కడిగి మిక్సీ పట్టుకోవాలి. జామ ఆకుల రసం తీసి దానిలో రెండు చెంచాల ఆవుపాలను కలపండి. ఆ తర్వాత ఈ రసాన్ని ముఖానికి పట్టించండి. ఇది మొటిమల వల్ల వచ్చే వాపును కూడా తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
జామ ఆకు నీరు:
చాలా మంది గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేస్తుంటారు. కంప్యూటర్ నుంచి వచ్చే నీలి కాంతి వల్ల ముఖంపై పిగ్మెంటేషన్ వల్ల మారుతుంది. అయితే వీటిని తగ్గించుకోవడానికి జామ ఆకులు ఎంతో ఉపయోగపడతాయని ఆయుర్వేదిక నిపుణులు చెబుతున్నారు. ఒక గిన్నెలో నీరు వేసి అందులో నాలుగు జామ ఆకులను వేసి దీనిని మరిగించాలి. చల్లారిన తర్వాత దానితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే చర్మం కాంతివంతంగా కనిపిస్తుందని ఆయుర్వేదిక నిపుణులు చెబుతున్నారు.
Also Read: జుట్టు బాగా పెరగాలా ? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి
బ్లాక్ హెడ్స్:
మోటిమల తర్వాత ఎక్కువగా అమ్మాయిలను వేధించే మరో సమస్య బ్లాక్ హెడ్స్. ఈ సమస్యకు జామ ఆకులు మంచి ఫలితాలను ఇస్తాయి. జామ ఆకులు, కలబందతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. కొద్దిగా జామ ఆకులను తీసుకుని వాటిని పేస్ట్ లాగా చేయాలి. ఆ తర్వాత అందులో కలబంద గుజ్జు, చిటికెడు పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకున్న తర్వాత 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మొటిమలు తగ్గడానికి ఇది మంచి చిట్కా.