Makhana Health Benefits: మఖానాలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇతర డ్రై ఫ్రూట్స్ తో పోలిస్తే మఖానా పోషకాహారంతో కూడి ఉంటుంది. దీని వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. అంతే కాకుండా మఖానా బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఎముకలు బలహీనంగా ఉన్నాయని ఆందోళన చెందేవారు మఖానాను నిత్యం తింటే ఎముకలు దృఢంగా మారతాయి.
మఖానా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..
బరువు తగ్గడం: మఖానాలో ఫైబర్ అధికంగా ఉంటుంది. మఖానా తినడం వల్ల చాలా కాలం పాటు కడుపు నిండుగా అనిపించేలా చేస్తుంది. అంతే కాకుండా ఆకలిని తగ్గిస్తుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మఖానాలో కేలరీలు తక్కువగా ఉంటాయి, కాబట్టి తరుచుగా మఖానా తినడం అలవాటు చేసుకుంటే మంచిది. బరువు తగ్గాలని అనుకున్న వారు మీ ఆహారంలో భాగంగా చేర్చుకోవచ్చు.
ఎముకలకు బలం:
మఖానాలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఇది పిల్లల ఎదుగుదలకు, శరీర అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
గుండె ఆరోగ్యం :
మఖానాలో ఉండే మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది అంతే కాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మఖానాను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది:
మఖానాలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
చర్మానికి మేలు చేస్తుంది:
మఖానాలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి. అంతే కాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా, మెరుస్తూ కనిపించేలా చేస్తాయి.
మఖానా ఎలా తినాలి.. ?
కాల్చిన మఖానా:
మఖానా కాల్చి తిన్నప్పుడు మాత్రమే చాలా రుచిగా ఉంటుంది. దీనిని కొద్దిగా నూనెతో కూడా కాల్చవచ్చు. కాల్చిన మఖానాపై ఉప్పు, మిరియాలు వంటివి చల్లుకుని తింటే రుచి మరింత మెరుగుపడుతుంది. కాల్చిన మఖానాను స్నాక్ గా లేదా పెరుగుతో కలిపి తినవచ్చు.
ఫ్రూటీ మఖానా:
ఫ్రూటీ మఖానా కొద్దిగా భిన్నమైన రుచిని కలిగి ఉంటుంది. కానీ ఇది తినడానికి తేలికగా ఉంటుంది.
Also Read: ముఖంపై మొటిమలా.. ? ఈ ఫేస్ ప్యాక్‌తో చెక్ !
పాలలో నానబెట్టడం:
మఖానాను పాలలో నానబెట్టి రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయాన్నే తినండి. దీనిలో కొంత చక్కెర లేదా తేనెను కలుపుకుని తిన్నా బాగుంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్
ఖీర్‌లో:
మఖానాను ఖీర్‌లో కలుపుకుని తినవచ్చు. ఇది రుచికరమైన అల్పాహారం. తరుచుగా మఖానా తనడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.
పెరుగుతో:
కాల్చిన మఖానాను పెరుగుతో కలిపి తినవచ్చు. ఇది ఆరోగ్యకరమైన, తేలికపాటి అల్పాహారం.