Poppy Seeds Benefits: సాధారణంగా అందరి వంటింట్లో మసాలా దినుసులు తప్పకుండా ఉంటాయి. ఇవి వంటలకు రుచి అందించడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. మసాలా దినుసుల్లో ఒకటి గసగసాలు. ఇవి మంచి పోషక విలువలను కలిగి ఉంటాయి. రోజువారి ఆహారంలో భాగంగా గసగసాలను చేర్చుకోవడం అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. శరీరంలోని కణాల వాపు తగ్గడానికి, గుండె ఆరోగ్యం పనితీరు మెరుగుపరచడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇన్ని లాభాలు ఉన్న గసగసాల గురించిన మరిన్ని ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గసగసాల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. గసగసాలలోని లిగ్నాన్స్ క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణితులను పెరగకుండా కాపాడతాయి.
గుండె ఆరోగ్యం:
చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను శరీరంలో తగ్గించేందుకు గసగసాలు ఉపయోగపడతాయి. ఇవి అసంతృప్త కొవ్వులను కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తక్కువగా ఉంటుంది. గసగసాల్లోని అధిక పొటాషియం రక్తపోటును నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. ధమనుల్లో కొలెస్ట్రాల్ పెరుగుదలను నియంత్రిస్తుంది. ఫలితంగా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
జీర్ణ ఆరోగ్యం:
ఫైబర్‌కు మంచి మూలమైన గసగసాలు పేగుల కదలికను మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా మలబద్ధకాన్ని నిరోధిస్తాయి. ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాను ఇవి అభివృద్ధి చేస్తాయి. ఈ దినుసులు కడుపునొప్పి నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి. డైటరీ ఫైబర్‌కు గసగసాలు మంచి మూలం. ప్రతి రోజు తరుచుగా గసగసాలను ఆహార పదార్థాల తయారీలో వాడటం మంచిది. ఇవి మీ జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా జీర్ణ సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తాయని అంటున్నారు.
శోధన నిరోధక లక్షణాలు:
గసగసాలలోని పోషకాల శరీరంలోని శోధన నిరోధక ప్రభావాలను చూపిస్తాయి. ఫలితంగా గుండె జబ్బులు, క్యాన్సర్, ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలు రాకుండా శరీరాన్ని కాపాడతాయి.
Also Read: కీరదోసకాయ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
ప్రోటీన్లకు మూలం:
గసగసాలల్లో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను, కండరాల సామర్ధ్యాన్ని పెంపొందించే గుణాన్ని కలిగి ఉంటాయి. గసగసాలు ఎక్కువగా తినడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. ఇందులోని ప్రోటీన్లు శరీర పెరుగుదలకు అవసరమైన పోషకాలను అందిస్తాయి.
మెరుగైన నిద్రకు:
నిద్ర అనేది ప్రతి ఒక్కరికి అవసరమైంది. గసగసాలు మంచి నిద్రకు ఉపకరిస్తాయి. మెదడుకు ఇవి ఉపశమనాన్ని కలిగించి నిద్రను మెరుగుపరిచేందుకు చక్కగా సహాయపడతాయి. నిద్ర లేమి సమస్యతో ఇబ్బంది పడేవారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతి రోజు నిద్రకు ముందు టీ స్పూన్ గసగసాల పొడిని తిన్నా.. పాలలో కలిపి తీసుకున్నా కూడా హాయిగా నిద్ర పడుతుంది.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)