Drink For Weight loss: ప్రస్తుతం మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా అధిక బరువు సమస్యతో సతమతమవుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా పెరిగిన బరువును తగ్గించుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. కొంతమంది పెరిగిన బరువు తగ్గించుకోవడానికి స్పెషల్ డైట్‌లు ఫాలో అవుతుంటే మరికొందరు జిమ్‌కి వెళ్తుంటారు. ఈ ప్రయత్నాలు చేస్తూనే ఇంట్లోనే ఈ దాల్చిన చెక్కతో తయారు చేసిన డ్రింక్ తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ప్రతి రోజు దాల్చిన చెక్క నిమ్మరసం, మెంతులతో చేసిన డ్రింక్ తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు. ఈ డ్రింక్ వల్ల ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మరి ఈ వెయిట్ లాస్ సూపర్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మకాయ: నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నిమ్మకాయను ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది బరువును తగ్గించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది.
దాల్చిన చెక్క: థర్మోజెనిక్ లక్షణాలు దాల్చిన చెక్కలో పుష్కలంగా ఉంటాయి. ఇది జీవక్రియను మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా బరువును తగ్గించడానికి దోహదం చేస్తుంది.
మెంతులు: మెంతులు హెపాటో ప్రొటెక్టివ్ ప్రభావాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. మెంతులు తినడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీంతో బరువు తగ్గేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. లివర్ ను డిటాక్సిఫై చేయడంలో కూడా ఇది సహాయపడుతుంది.
ప్రతి రోజు ఉదయాన్నే దాల్చిన చెక్క, నిమ్మరసం, మెంతులతో చేసిన డ్రింక్ తాగడం వల్ల కాలేయం, గుండె ఆరోగ్యంగ ఉంటాయి. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు బరువు తగ్గించడంలో ఉపయోగపడతాయి. అంతే కాకుండా రక్తంలో చెక్కర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతాయి.
Also Read: జుట్టు ఒత్తుగా పెరగాలంటే.. ఇది వాడండి
ఈ డ్రింక్ తయారీ విధానం:
దాల్చిన చెక్క పొడి- 1 టీ స్పూన్
నిమ్మకాయ- 1
మంతులు- 1 టీస్పూన్
నీరు – 1 కప్పు
ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు నీరు వేసి వేడి చేయాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో నిమ్మకాయను కట్ చేసి అందులో అందులో పిండుకోవాలి. అలాగే అందులోకి 1 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని యాడ్ చేసుకోవాలి. తర్వాత పౌడర్ చేసుకున్న మెంతుల పొడిని వాటర్‌లో వేసుకోవాలి. ఇది మరిగిన తర్వాత డ్రింక్ పూర్తవుతుంది.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)