Toenail Fungus: వర్షాకాలం మొదలైందంటే చాలా రకాల ఇన్ఫెక్షన్లు మొదలవుతుంటాయి. వర్షం నీటిలో తడవడం వల్ల చర్మం వివిధ రకాలుగా ప్రభావితం అవుతుంది. ముఖ్యంగా కాళ్లు అయితే విపరీతంగా పాడవుతాయి. బయటకు వెళ్లిన క్రమంలో వర్షం నీటిలో తడిచి కాళ్లలో ఇన్ఫెక్షన్లు, మురికి వంటి సమస్యలు ఏర్పడతాయి. బురద నీటిలో తిరిగితే పాదాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అందువల్ల వర్షాకాలంలో పాదాలను తరచూ శుభ్రంగా ఉంచుకోవాలి. లేకపోతే ఇన్ఫెక్షన్ల బారిన పడి కాళ్ల పగుళ్లు, మంటలు, దురద వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గోళ్లలో మురికి పేరుకోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. అయితే ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు కేవలం ఇంట్లోని వస్తువులను ఉపయోగించి కాళ్లను శుభ్రంగా తయారుచేసుకోవచ్చు. అయితే ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గోళ్లలో మట్టి చేరడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి. అందుకే గోళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి. తరచూ పాదాలను నీటిగా శుభ్రం చేసుకోవాలి. ఈ క్రమంలో కాలి గోళ్లను కూడా పరిశుభ్రంగా కడుక్కోవాలి. లేకపోతే కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు తరచూ బయటకు వెళ్లి వచ్చిన అనంతరం కాళ్లను సబ్బుతో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను నివారించవచ్చు. పాదాలను శుభ్రంగా ఉంచుకోవడానికి ఇంట్లోని చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి.
బేకింగ్ సోడా
బేకింగ్ సోడా పాదాలను శుభ్రం చేసేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. వంటింట్లో ఉండే బేకింగ్ సోడాను గోరువెచ్చని నీటిలో కలుపుకోవాలి. అనంతరం కాళ్లను ఆ నీటిలో పాదాలను 10 నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత పాదాలను బాగా రుద్ది శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మురికి తొలగిపోయి శుభ్రంగా మారుతుంది.
హిమాలయన్ పింక్ సాల్ట్
పింక్ సాల్ట్ మురికిని తొలగించేందుకు సహాయపడుతుంది. పింక్ సాల్ట్ లో కొబ్బరి నూనెను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు బాగా రాసి స్ర్కబ్ చేసుకోవాలి. అనంతరం నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు తొలగిపోతాయి.
వెనిగర్
ఒక బకెట్ తీసుకుని అందులో సగం నీరులో వెనిగర్ కలుపుకోవాలి. అనంతరం బకెట్లోని నీటిలో 15 నిమిషాల పాటు పాదాలను ఉంచాలి. అనంతరం పాదాలను టవల్ తో తుడుచుకుని ఫుట్ క్రీమ్ రాసుకోవాలి. ఇలా వారినికి 3 సార్లు చేస్తే పాదాలు శుభ్రంగా మారుతాయి.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)