
Back Pain Relief Tips : ప్రస్తుతం నడుము నొప్పితో బాధపడేవారు చాలా మందే ఉంటారు. నొప్పి తగ్గడానికి విపరీతంగా మందులు వాడతారు. అయితే జీవన విధానాన్ని మార్చుకోవడం, నడుము నొప్పి తగ్గే విధంగా చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే నడుం నొప్పి నుంచి పూర్తి ఉపశమనం పొందొచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుని పాటిద్దామా!
సరైన భంగిమలు పాటించాలి..
కూర్చునే, నిల్చునే భంగిమల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆఫీసులో కూర్చున్నప్పుడు, నిలబడి ఉన్నప్పుడు సరైన భంగిమ పద్ధతులను పాటించండి. మనం కూర్చునే విధానాన్ని బట్టి కూడా నడుము నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. అందుకే కూర్చున్నా, నిల్చున్నా కచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకించి ప్రతిరోజూ గంటల తరబడి కంప్యూటర్ ముందు పని చేసేవారు మంచి కుర్చీని ఎంపిక చేసుకొని కూర్చోవాలి.
సరైన చెప్పుల వాడకం..
నడుము నొప్పి ఉన్నవారు చెప్పుల విషయంలో జాగ్రత్త పడాలి. నడుం నొప్పిని నివారించడం కోసం చెప్పుల వినియోగం పైన కూడా జాగ్రత్త వహించండి. ఎత్తు మడమల చెప్పులు ఎక్కువగా వేసుకునే వారికి నడుం నొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే తక్కువ మడమ ఉన్న చెప్పులను ధరించండి. ఇవి మన నడుంపై ఒత్తిడిని తగ్గిస్తాయి. ఒక్క అంగుళం కంటే తక్కువ మడమ ఉంటేనే ఫలితం ఉంటుంది.