EPAPER

Unwanted Hair Tips: అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చెక్ పెట్టండి..

Unwanted Hair Tips: అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చెక్ పెట్టండి..

Home Remedies to Remove Unwanted Hair Naturally: చాలా మంది యువతులు, మహిళల్ని వేధించే సమస్య అవాంఛిత రోమాలు. వీటి వల్ల ఫేస్ అందవికారంగం కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం హార్మోన్ల సమస్య. మహిళల్లో కార్టిలాల్ ఉత్పత్తి కాకపోవడం వల్ల గానీ, అవసరానికి మించి విడుదలైన ఈ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధిక బరువు వల్ల కూడా అవాంఛిత రోమాలు వస్తాయట. పలు అనారోగ్య సమస్యల వల్ల స్టెరాయిడ్స్ తీసుకుంటున్న వారికి కూడా అవాంఛిత రోమాలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తొలగించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వీటికోసం బ్యూటీ పార్లర్‌కి వెళ్లి నానాపాట్లు పడుతుంటారు. అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంట్లోనే దొరికే నాచురల్ ప్రొడక్ట్స్‌తోనే ముఖంపై ఉన్న వెంట్రుకలను తొలగించవచ్చు. ఈ చిట్కాలు పాటించడం ద్వారా ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలు తొలగిపోయి.. అందంగా కనిపిస్తారు.


బొప్పాయి, పసుపు, తేనె ఫేస్ ప్యాక్
బొప్పాయి గుజ్జులో చిటికెడు పసుపు, టీస్పూన్ తేనె కలిపి వాటిని బాగా మిక్స్ చేసి.. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేయండి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే అవాంఛిత రోమాలు పెరగకుండా అడ్డుకుంటాయి.

శెనగపిండి, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్
నాలుగు చెంచాల శెనగ పిండిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేయండి. అరగంట తర్వాత ముఖాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే ఎక్స్ ఫోలియెంట్‌గా పనిచేసి ముఖంపై వెంట్రుకలు రాకుండా అడ్డుకుంటాయి.


తేనె, పంచదార, కార్న్ ఫ్లోర్, నిమ్మరసం ఫేస్ ప్యాక్
నాలుగు టేబుల్ స్పూన్ మొక్క జొన్న పిండిలో రెండు టేబుల్ స్పూన్ పంచదార, టీ స్పూన్ తేనె, నిమ్మరసం కలిపి వాటిని బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖంపై  అప్లై చేయండి.  అరగంట తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకుంటే ముఖంపై వెంట్రుకలు తొలగిపోతాయి.

ఓట్స్, అరటి పండు ఫేస్ ప్యాక్
ఓట్స్, పండిన అరటిపండు కలిపి పేస్ట్ లాగా తయారు చేయాలి. ఆ తర్వాత ముఖానికి స్క్రబ్ చేయాలి. 10-15 నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. అవాంఛిత రోమాలు పెరగకుండా అడ్డుకుంటాయి.

Also Read:  బియ్యంపిండిలో వీటిని కలిపి ఫేస్ ప్యాక్ వేస్తే.. మచ్చలన్ని మటుమాయం

కాఫీపొడి, అలోవెరా జెల్
రెండు టేబుల్ స్పూన్ కాఫీపొడిలో కొంచె అలోవెరా జెల్ కలిపి ముఖానికి స్క్రబ్ చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖంపై అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.

పాలు, పసుపు ఫేస్ ప్యాక్
పాలల్లో చిటికెడు పసుపు వేసి ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని మసాజ్ చేస్తూ సాధారణ నీటితో కడగండి.. అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.

వీటితో పాటు తినే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోండి. దీంతో పాటు ఫైటో ఈస్ట్రోజన్ ఉండేలా చూసుకుంటే హార్మోన్ల సమస్య దరిచేరదు.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

 

Related News

Pasta Kheer: పాస్తా పాయసాన్ని ఇలా వండారంటే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు

Coffee face mask: కాఫీ పొడితో ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మంపై ఉన్న టాన్ మొత్తం పోతుంది, మెరిసిపోతారు

Bone Health: ఎముకలకు ఉక్కు లాంటి బలాన్నిచ్చేవి ఇవే !

Tea: ఎక్కువగా టీ తాగుతున్నారా ? ఎంత ప్రమాదమో తెలుసుకోండి

Coconut Water: కొబ్బరి నీరు తాగుతున్నారా ? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి

Sleeping: నిద్ర లేమి సమస్యకు చెక్ పెట్టండిలా ?

Kumkum: ఇంట్లోనే కుంకుమను ఎలా తయారు చేసుకోవాలో తెలుసా ?

Big Stories

×