Homemade Hair Mask: మారుతున్న జీవనశైలితో పాటు వాతావరణ పరిస్థితులు కూడా జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల కూడా జుట్టు రాలుతుంది. అంతే కాకుండా జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టు రాలకుండా ఉండటానికి కొన్ని రకాల హెయిర్ మాస్క్ లను ఉపపయోగించడం మంచిది. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.
1.పెరుగు, తేనె హెయిర్ మాస్క్:
కావలసినవి
పెరుగు- 1/2 కప్పు
తేనె- 2 టీస్పూన్
గుడ్డు -1
తయారీ విధానం:
ఈ హెయిర్ మాస్క్ తయారు చేసుకోవడానికి పైన చెప్పిన మోతాదుల్లో అన్ని పదార్థాలను ఒక బౌల్ లో తీసుకుని బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టు, కుదుళ్లకు అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో కడగండి .ఈ హెయిర్ మాస్క్ లో ఉపయోగించిన పెరుగు జుట్టుకు తేమను అందిస్తుంది, తేనెలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గుడ్డు కూడా జుట్టును బలాన్ని అందిస్తుంది.
2. అవోకాడో , కొబ్బరి నూనె హెయిర్ మాస్క్:
కావలసినవి:
అవకాడో (గుజ్జు)- 1/2 టేబుల్ స్పూన్
కొబ్బరి నూనె- 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం:
మెత్తని అవకాడో గుజ్జులో కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టు, కుదుళ్లకు అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. అవోకాడోలో విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణనిస్తాయి. దీనిలోని కొబ్బరి నూనె జుట్టుకు బలాన్ని ఇస్తుంది.
3. ఎగ్, ఆలివ్ ఆయిల్ హెయిర్ మాస్క్:
కావలసినవి:
ఎగ్-1, ఆలివ్ నూనె -2 టీస్పూన్లు
నిమ్మరసం -1 టీస్పూన్
తయారీ విధానం:
పైన చెప్పిన పదార్థాలను ఒక బౌల్ లో బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టు, తలకు అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. ఎగ్ జుట్టుకు ప్రొటీన్‌ను అందిస్తుంది. ఆలివ్ ఆయిల్ జుట్టుకు తేమను ఇస్తుంది. ఇందులోని నిమ్మరసం జుట్టును మెరిసేలా చేస్తుంది.
హెయిర్ మాస్క్‌ల వల్ల కలిగే ప్రయోజనాలు:
ఈ హెయిర్ మాస్క్‌లు జుట్టుకు సహజ పోషణనిస్తాయి. జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి చుండ్రు సమస్యను తగ్గిస్తాయి. ఈ హెయిర్ మాస్క్‌లను వారానికి ఒకటి లేదా రెండు సార్లు వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.