
Eyebrows : ఒత్తైన కనుబొమ్మలు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే అందరికీ అలా ఉండవు. చాలామందికి తక్కువశాతం కనుబొమ్మలు ఉంటాయి. కనుబొమ్మలు ఒత్తుగా ఉన్నవారు చిన్నగా కనిపిస్తారు. అయితే చాలా కారణాల వల్ల చాలామందికి కనుబొమ్మలు ఒత్తుగా, దృఢంగా పెరగవు. మనిషికి కనుబొమ్మలు అందంగా ఉంటాయి.. అంతేకాకుండా మన ముఖానికి చక్కటి ఆకృతిని ఇస్తాయి కనుబొమ్మలు ఎంత బాగుంటే మన ముఖం అంత అందంగా కనిపిస్తుంది. చాలా మందిలో కనుబొమ్మలు పల్చగా ఉంటాయి ఒత్తుగా నల్లగా కనిపించేందుకు మార్కెట్‌లో లభించే అనేక రకాల ప్రొడెక్టులు ఉపయోగిస్తూ ఉంటారు.
అయితే వీటిని ఉపయోగించకుండా కొన్ని రకాల చిట్కాలను ఉపయోగించడం వల్ల మన కనుబొమ్మలు నల్లగా, ఒత్తుగా మార్చుకోవచ్చు. ఈ చిట్కాలను తయారు చేసుకోవడానికి మనం ఉల్లిపాయ రసం, కొబ్బరినూనె వాడాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో మూడు టీ స్పూన్ల ఉల్లిపాయ రసం తీసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి కలిపి ఆ తర్వాత దీంట్లో దూది ముంచి కనుబొమ్మలపై రాసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నైట్ పడుకునే ముందు కనుబొమ్మలపై రాసుకొని ఉదయం లేచిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా వారం రోజులపాటు క్రమం తప్పకుండా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా మరియు నల్లగా పెరుగుతాయి.
అలాగే కనుబొమ్మలను అందంగా మార్చే మరో చిట్కా.. ఆముదం నూనె, విటమిన్ ఈ టాబ్లెట్లను ఇందుకోసం మనం ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల ఆముదం నూనె వేసి ఆ తర్వాత రెండు విటమిన్ ఈ క్యాప్సుల్స్ వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని సున్నితంగా కనుబొమ్మలపై మర్దనా చేయాలి. ఇలా రాత్రి పడుకునే ముందు చేసి ఉదయాన్నే కడిగేయాలి. ఇలా చేయడం వల్ల కూడా మన కనుబొమ్మలు అందంగా మారుతాయి. ఈ చిట్కాలను పాటించడం వల్ల సులభంగా, తక్కువ సమయంలోనే మన కనుబొమ్మలను ఒత్తుగా.. నల్లగా మార్చుకోవచ్చు.