Coconut flower : కొబ్బరిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల కొబ్బరికి సంబంధించిన ఏ పదార్థం ఆహారంగా తీసుకున్నా ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు అందుతాయి. కొబ్బరి కాయ, కొబ్బరి నీళ్లు, కొబ్బరి తురుము, కొబ్బరి నూనె, ఇలా ఆఖరికి కొబ్బరి పువ్వుతో సహా అన్నింటితోను పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయి. అయితే కొబ్బరి కాయను దేవుడి మందిరం వద్ద కొట్టగానే అందులో పువ్వు వస్తే ఎంతో శుభం జరుగుతుందని భావిస్తారు. కానీ ఆ కొబ్బరి పువ్వుతో ఆరోగ్యానికి పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా ఈ కొబ్బరి పువ్వు లభిస్తుంది.
కొబ్బరి పువ్వులో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. కాల్షియం, ఫైబర్, మెగ్నీషియం, ఫాస్పరస్, మాంగనీస్, డైటరీ వంటి ఖనిజాలు ఉంటాయి. అంతేకాదు ఇందులో కరిగే చక్కెరలు కూడా ఉంటాయి. కొబ్బరి పువ్వు తినడం వల్ల నీరసం, అలసట వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మరోవైపు వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ పరాన్న జీవి కారణంగా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు కూడా శరీరానికి ప్రయోజనాలు కలిగిస్తాయి. ఇక చర్మ సౌందర్యానికి కూడా కొబ్బరి పువ్వు అద్భుతంగా పనిచేస్తుంది. చర్మంపై మడతలు, మచ్చలు, నల్ల మచ్చలను కూడా కొబ్బరి పువ్వు నివారిస్తుంది. సూర్యరశ్మి నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. మధుమేహం వంటి లక్షణాలు ఉన్న వారు కూడా దీనిని తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తొలగించడానికి కొబ్బరి పువ్వు సహకరిస్తుంది.
గుండె జబ్బుల సమస్య, కొలస్ట్రాల్ వంటి సమస్యలను కూడా ఇది నివారిస్తుంది. థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్న వారు కొబ్బరి పువ్వును తీసుకోవడం మంచిది అని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు జుట్టు నల్లగా, ఒత్తుగా ఉండాలనుకునే వారు దీనిని తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)