Weight Loss Tips: ప్రస్తుతం చాలా మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. తరచూ తీసుకుంటున్న ఆహారం, మారుతున్న జీవనశైలి కారణంగా చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. రోజూ వ్యాయామం, సరైన ఆహారం వంటివి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయినా కూడా ఇవి పాటించినంత కాలం మాత్రమే బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. తిరిగి యథావిధిగా మళ్లీ బరువు పెరుగుతుంటారు. ఇలా బరువు పెరగడం వల్ల కొలస్ట్రాల్, అధిక రక్తపోటు, మధుమేహం వంటి చాలా రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారు ముఖ్యంగా వ్యాయామం మాత్రమే కాదు వంటింట్లో ఉండే వస్తువుల కారణంగా కూడా బరువు పెరిగే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ తరుణంలో వంటింట్లో కొన్ని మార్పులు చేస్తే ఈజీగా బరువు తగ్గవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా ఇంట్లోని ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిన ఆహార పదార్థాలను అస్సలు తినకూడదని వీటిలో మార్పులు చేస్తే బరువు తగ్గే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. అందులో ప్రత్యేకంగా ప్యాక్ చేసిన ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటివి అస్సలు తినకూడదు. వీటిని ఫ్రిడ్జ్ లో నిల్వ చేస్తే వాటిలో రసాయనాలు ఉత్పత్తి చెంది రోగాల బారినపడే అవకాశం ఉంటుంది.
ఫ్రిడ్జ్ లో కేవడం కూరగాయలు, పండ్లను మాత్రమే స్టోర్ చేసుకుని తినాలి. ఎందుకంటే ఆకలితో ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన ప్రతీసారి ఏదైనా ఫుడ్ కనిపిస్తే దానిని తిని కూడా బరువు పెరుగుతుంటారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా ఆహారంలో నూనెను తక్కువగా వాడాల్సి ఉంటుంది. మరోవైపు ఉప్పు, పంచదార, కారంను కూడా ఎంత తక్కువగా తింటే అంత మంచిది. చేపలు, మాంసాహారం, వంటివి కూడా ఫ్రిడ్జ్ లో పెట్టకుండా ఒక్క రోజులోనే తినేయాలి. ఎక్కువగా సలాడ్స్, అంటే టమాటా, దోసకాయ, క్యారెట్ వంటి వాటితో తయారుచేసింది తరచూ తీసుకుంటే మంచిది.
భోజనం చేసే సమయంలోను కొన్ని జాగ్రత్తలు పాటించాలి. భోజనం మధ్యలో నీటిని తీసుకోకూడదు. భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత కొన్ని నీళ్లు తాగాలి. అంతేకాదు భోజనం చిన్న ప్లేట్లలో చేయడం వల్ల ఆకలి తగ్గుముఖం పడుతుంది. ఈ తరుణంలో పండ్లను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)