Walking Reduces Back Pain: ప్రస్తుతం చాలా మంది అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అందులో నడుము నొప్పి కూడా ఒకటి. ఎక్కువ సేపు కూర్చొని పని చేసే వారు, అధిక బరువులు మోసే వారు బ్యాక్ పెయిన్‌తో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యతో ఓ పట్టాన కూర్చోలేరు కూడా. అంతే కాకుండా పనిపై ఫోకస్ పెట్టలేకపోతుంటారు. ఇటీవల బ్యాక్ పెయిన్‌తో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అధిక బరువు సైతం వీపుకు దిగువ భాగంపై ఒత్తిడిని పెంచుతుంది. ఇది వెన్నెముక వంపుకు దారితీస్తుంది. ఫలితంగా డిస్క్ వంటి సమస్యలు కూడా పెరుగుతాయి.
వయసు పెరిగే కొద్దీ శరీర అవయవాల అరుగుదల జరుగుతుం.నిల్చోవడం, కూర్చోవడం, సరైన సమయం పొజిషన్‌లో ఉండకపోతే వెన్నెముకపై ఒత్తిడి కలుగుతుంది. దీంతో నొప్పి వస్తుంది. ఎముకలపై భారం పడి అరుగుదలకు గురవడం వల్ల కీళ్లలో చీలిక ఏర్పడం వల్ల కూడా వెన్ను సమస్యలు వస్తాయి.
వెన్నునొప్పితో బాధపడేవారు దినచర్యలో భాగంగా వాకింగ్ క్రమం తప్పకుండా చేయాలి. సిడ్నీ యూనివర్సిటీ, మాక్వేరీ విశ్వవిద్యాలయం సంయుక్తంగా చేసిన ఓ తాజా అధ్యయనం ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. నడక నడుము నొప్పిని తగ్గిస్తుందని తెలిపారు. వారానికి ఐదు రోజుల పాటు నడిస్తే చాలు వెన్ను నొప్పి రాకుండా ఉంటుందట.
నడకే మార్గం..
తాజా అధ్యయనం ప్రకారం వారానికి రెండు నుంచి ఐదు సార్లు నడవడం మంచిది. సగటున 130 నిమిషాల నడిచే వ్యక్తులు ఎటువంటి చికిత్స తీసుకోని వారితో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువకాలం నడుము నొప్పి లేకుండా ఉంటారని అధ్యయనం ద్వారా వెల్లడైంది. సాధారణ శారీరక శ్రమకు వెన్ను నొప్పి అంతరాయం కలిగింస్తుంది. నడక వెన్ను నొప్పిని ప్రభావంతంగా పని చేస్తుంది.
2019 నుంచి 2022 వరకు జరిగిన పరిశోధనలో సుమారు 700 మందికి పైగా పాల్గొన్నారు. ఆరు నెలల పాటు ఆరు సెషన్లలో పీజియో థెరపిస్టులు వాకింగ్ చేశారు. రోజు దాదాపు అరగంట పాటు. అయితే నిర్విరామంగా వాకింగ్ చేసేవారికి వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభించిందట. అధ్యయనంలో పాల్గొన్న వారెవరూ ఆ సమయంలో వెనుకకు సంబంధించి ఎలాంటి సమస్యను ఎదుర్కోలేదు. వారికి వెన్ను నొప్పి ఉపశమనం లభించిందట.
ఈ అధ్యయనంలో పాల్గొన్నవారు ఆరు నెలల పాటు నడక కొనసాగించిన తర్వాత మూడేళ్ల నుంచి వారిని వేధిస్తున్న నొప్పి కూడా మాయమైందని తెలిపారు. ఇందులో పాల్గొన్నవారిని పరిశోధకులు కూడా ప్రతి నెలా పరీక్షలు నిర్వహించారు. వాకింగ్ చేసే వారిలో మళ్లీ వెన్నునొప్పి వచ్చే ప్రమాదం కూడా 20% తగ్గినట్లు వెల్లడించారు. ఆ తర్వాత తక్కువ వెన్నునొప్పితో డాక్టర్‌ను సంప్రదించి వారి సంఖ్య కూడా 43% తగ్గిందని అన్నారు. 112 రోజులకు వెన్ను నొప్పి మళ్లీ వచ్చే ప్రమాదం కాస్త తగ్గిందట. 208 రోజులకు నొప్పి చాలా వరకు లేకుండా మాపోయిందని తెలిపారు. అధ్యయనంలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది మహిళలున్నారని, వారి వయసు 43 నుంచి 26 ఏళ్ల మధ్య ఉంటుందని పరిశోధకులు తెలిపారు.
Also Read: బీర్ తాగితే బరువు పెరుగుతారా ? నిపుణులు ఏం చెబుతున్నారంటే ..
ఇదిలా ఉంటే వెన్ను నొప్పిని తగ్గించేందుకు నడక ఎందుకు ప్రభావవంతంగా ఉంటుందో.. తాము కచ్చితంగా చెప్పలేమని అధ్యయనకర్తలు వెల్లడించారు. శరీరం, మెదడు మధ్య నొప్పి సంకేతాలను నిరోధించే ఫీల్‌గుడ్ ఎండార్ఫిన్లు విడుదలవడం వల్ల నొప్పి తగ్గి ఉండవచ్చని అన్నారు. వ్యాయామం కూడా వెన్ను నొప్పి నివారించడంలో ప్రభావవంతంగా ఉండవచ్చని తెలిపారు.