
Kitchen Tips: ప్రతి కిచెన్‌లోనూ ఉండే పెద్ద సమస్య.. సింక్‌ను శుభ్రం చేయడం. సింక్‌లో ఆహారం ఇరుక్కుపోయి బ్లాక్ అవ్వడం వల్ల అలాగే, డర్టీ డిష్‌లు జిడ్డు మరకల కారణంగా సింక్ పసుపు రంగులోకి మారుతుంది. దీంతో కిచెన్ విపరీతమైన వాసన వస్తుంటుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటించడం ద్వారా కిచెన్ సింక్‌ను మెరిసేలా చేయవచ్చు. అదెలాగో చూద్దామా!
చాలా తక్కువ ఆల్కహాల్ ఉన్న రెడ్ వైన్‌ను సింక్ మొత్తానికి అంటేలా పోసి కాసేపు నాననిచ్చి..స్క్రబ్బర్‌తో క్లీన్ చేస్తే తళతళా మెరిసిపోతుంది. కొద్దిగా నీటిలో చింతపండు వేసి నానబెట్టి.. అందులో కాస్త నిమ్మరసం కలిపి సింక్‌పై పోసి క్లీన్ చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
హెడ్రోజన్ పెరాక్సైడ్ ద్వారా కూడా సింక్‌ను క్లీన్ చేసుకోవచ్చు. దీనికోసం హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను బేకింగ్ సోడాతో కలిపి సింక్‌పై పోయండి. కాసేపు నానిన తర్వాత స్క్రబ్బర్‌తో క్లీన్ చేయండి. వైట్ వెనిగర్, బేకింగ్ సోడా రెండూ కలిపి మిశ్రమంగా తయారు చేసి.. సింక్‌పై పోసి క్లీన్ చేస్తే సింక్ మెరిసిపోతుంది.