EPAPER

Mallipoola Rasam: మల్లెపూలతో రసం ఏంట్రా.. అన్నంలో వేసుకుని మరీ తినేస్తున్నారే, ఈ వీడియో చూస్తే షాకవుతారు

Mallipoola Rasam: మల్లెపూలతో రసం ఏంట్రా.. అన్నంలో వేసుకుని మరీ తినేస్తున్నారే, ఈ వీడియో చూస్తే షాకవుతారు

Mallipoola Rasam: మల్లెపూలతో మహిళలకు అందమే కాదు, ఇంట్లో వాళ్లందరికీ ఆరోగ్యాన్ని అందిస్తుందట. మల్లెపూలతో చేసిన రసం ఆరోగ్యానికి ఎంతో మంచిదట. తాజాగా ఈ రెసిపీకి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఈ రసం ఎలా చేస్తారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


మల్లెపూల రసం చేయడానికి కావాల్సిన పదార్థాలు:

జీలకర్ర-1 టేబుల్ స్పూన్


మిర్యాలు- చిటికెడు

వెల్లుల్లి- 3 రెబ్బలు

టమాటాలు-1

ఇంగువ- చిటికెడు,

పసుపు-1 టేబుల్ స్పూన్

ఉప్పు- తగినంత

కారం- తగినంత

మల్లెపూలు-1/4 కప్పు

మల్లెపూల రసం చేసే పద్దతి:

1. ముందుగా రోలు తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 3 వెల్లుల్లి రెబ్బలు వేసి దంచాలి.

2. ఇప్పుడు ఒక గిన్నెలో కాస్త చింతపండు, ఒక టమాట, కప్పు మంచి నీరు, ఒక టీ స్పూన్ ఇంగువ, ఒక టేబుల్ స్పూన్ పసుపు పొడి వేసి బాగా కలపాలి.

3. ఇప్పుడు ఓ పాన్ తీసుకుని స్టౌ మీద పెట్టి వెలిగించాలి. అందులో టేబుల్ స్పూన్ నూనె, 1 టీ స్పూన్ ఆవాలు, 1 ఎండు మిరపకాయ ముక్కలు, కాస్త కరివేపాకు తోపాటు ముందుగా రోలులో దంచిన మిర్యాలు, వెల్లుల్లి, జీలకర్ర పేస్టును వేసి బాగా కలపాలి. దీనికి ఓ కప్పు నీళ్లు కలపాలి. మూత పెట్టి కాసేపు వేడి చేయాలి.

4. వేడికి ఈ మిశ్రమం నుంచి నురగ వస్తుంది. ఆ తర్వాత వంటకంలో కాస్త కొత్తి మీర వేయాలి. మరికాసేపు మళ్లీ వేడి చేయాలి.

5. ఇప్పుడు ఆ మిశ్రమంలో శుభ్రంగా కడిగిన 1/4 కప్పు మల్లెపూలు వేయాలి. దానికి కాస్త బెల్లం కలపాలి. ఈ మిశ్రమాన్ని సుమారు 15 నిమిషాల పాటు మరిగించాలి.

6. ఆ తర్వాత సౌవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారబెట్టాలి. రసం కాస్త చల్లలగా మారాక అందులోని మల్లెపూలు తీసివేయాలి. రుచికరమైన మల్లెపూల రసం రెడీ.

7. ఇప్పుడు వేడి వేడి అన్నంలో మల్లెపూల రసం కలిపి తింటే టేస్టీ అదిరిపోతుంది. ఇదే పద్దతిలో మీరూ మల్లెపూల రసాన్ని తయారు చేసుకుని కడుపునిండా భోజనం చేయండి.

సోషల్ మీడియాలో మల్లెపూల రసం వీడియో వైరల్

ప్రస్తుతం సోషల్ మీడియాలో మల్లెపూల రసం వంటకం వైరల్ అవుతోంది. కొంత మంది ఇదెక్కడి రసం రా బాబూ అంటూ కామెంట్స్ పెడుతుంటే, మరికొంత మంది మల్లెపూలలోనూ ఔషధ గుణాలు ఉన్నాయంటున్నారు. మల్లెపూల రసం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది అంటున్నారు. ఇంకొంత మంది మల్లెపూల రసంలో కలిపే చింతపండు, టమాటతో పాటు సుగంధ ద్రవ్యాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు. వీటికి మల్లెపూలలోని ఔషధ గుణాలు తోడై ఆరోగ్యానికి మరింత లాభం కలిగిస్తాయంటున్నారు. ఇంతకీ మల్లెపూల రసం ఆరోగ్యానికి మంచిదా? కాదా? అనేది న్యూట్రీషియనిస్టులు చెప్పాల్సిందే!

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read Also:బీరకాయ కారం పొడి రెసిపీ ఇలా చేసుకుంటే నెలంతా తినవచ్చు, ఎంతో ఆరోగ్యం కూడా

Related News

Porphyria: వెల్లుల్లి తింటే ప్రాణాలు పోతాయట, అమెరికన్ లేడీకి వింత రోగం!

Children Eye Problems: వామ్మో సెల్ ఫోన్, పిల్లలకు అస్సలు ఇవ్వకండి, లేదంటే ఈ ముప్పు తప్పదు!

Roadside Book Stores: రోడ్లపై పుస్తకాలు అమ్మితే.. ఏం వస్తుంది…?

Murine Typhus: అమ్మో దోమ.. కేరళలో కొత్త రోగం, ఈ అరుదైన వ్యాధి సోకితే ఏమవుతుందో తెలుసా?

Coffee Benefits: మిరాకిల్.. రెండు కప్పుల కాఫీతో ఇన్ని బెనిఫిట్సా? మీరు నమ్మలేరు!

Mirchi: మిరపకాయలకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..? అందుకు మిరియాలే కారణమంటా..

Tips For Pregnant Women: గర్భిణీలు ఈ పోషకాహారం తింటే తల్లీ, బిడ్డా ఆరోగ్యంగా ఉంటారు

Big Stories

×